ETV Bharat / city

RRR DISQUALIFICATION: 'స్పీకర్‌ పక్షపాతధోరణితో వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోంది' - రఘురామ అనర్హత పిటిషన్‌ పై చర్యలు తీసుకోవాలన్న విజయసాయి

ఎంపీ రఘురామ అనర్హత పిటిషన్​పై లోక్​సభ స్పీకర్​ చర్యలు తీసుకోవడంలో పక్షపాతధోరణి వహిస్తున్నట్లు కనిపిస్తోందని ఆరోపించారు. గతంలో ఇటువంటి పరిస్థితి ఎదురైనపుడు తీసుకున్న చర్యలు, కోర్టు చెప్పిన తీర్పులను ఉదహరిస్తూ వేగంగా నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఈ విషయంలో జాప్యం చేస్తే సభాసమావేశాల్లో పార్టీ ఎంపీలతో కలిసి నిరసన చేపట్టనున్నట్లు తెలిపారు.

RRR DISQUALIFICATION
స్పీకర్‌ పక్షపాతధోరణితో వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోంది
author img

By

Published : Jul 9, 2021, 8:06 PM IST

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుపై(MP RAGHURAMA) అనర్హత పిటిషన్‌ వ్యవహారంపై లోకసభ స్పీకర్‌ ఓం బిర్లా పక్షపాతధోరణితో వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోందని వైకాపా పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి(VIJAYA SAI REDDY) ఆరోపించారు. అనర్హత పిటిషన్‌ ఇచ్చి ఏడాది పూర్తైనా.. ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని అన్నారు. అనర్హత పిటిషన్‌లో ఎక్కడ సంతకాలు చేయలేదో వాటికి సంబంధించిన అదనపు వివరాలను జోడించినట్లు తెలిపారు. చట్ట వ్యతిరేకంగా తీవ్ర పదజాలం వాడుతూ ప్రభుత్వాన్ని, పార్టీని విమర్శిస్తున్న కథనాల వివరాలను అందించినట్లు పేర్కొన్నారు. రఘురామపై అనర్హత వేటు వేయాలని మరోసారి కోరినట్లు విజయసాయి రెడ్డి వెల్లడించారు.

ఇందుకు స్పీకర్‌ స్పందిస్తూ.. నోటీసు ఇచ్చిన తర్వాత 15 రోజుల్లో సభాహక్కుల సంఘానికి సిఫారసు చేయనున్నట్లు బదులిచ్చినట్లు చెప్పారు. కానీ.. గతంలో అనర్హత పిటిషన్లు వచ్చినప్పుడు.. రబిరైజర్, సోమనాథ్​ చటర్జి వంటి వారు సభా హక్కుల కమిటీకి సిఫార్సు చేయలేదని విజయసాయి గుర్తుచేశారు. శరద్ యాదవ్ అంశంలో రాజ్యసభ ఛైర్మన్ కేవలం వారం రోజుల్లోనే చర్యలు తీసుకున్న ఉదంతాలను ప్రస్తావిస్తూ రఘురామపై చర్యలు వేగవంతం చేయాలని కోరారు.

సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం 6 నెలలలోపే అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవలసి ఉందన్న విజయసాయిరెడ్డి.. ఏడాది కాలంగా స్పీకర్ స్పందించకపోవడం పక్షపాత ధోరణితో కూడుకున్నట్లుగా కనిపిస్తోందన్నారు. ఇకనైనా స్పీకర్ వైఖరి మార్చుకోకపోతే వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ఈ అంశాన్ని ప్రస్తావిస్తానన్నారు. ఈ విషయంపై స్పీకర్‌ త్వరితగతిన నిర్ణయం తీసుకోకపోతే.. తీవ్రంగా పరిగణించి.. రానున్న పార్లమెంటు సమానేశాల్లో పార్టీ ఎంపీలంతా కలిసి ఆందోళనకు దిగనున్నట్లు వెల్లడించారు.

ఎంపీపై చర్యల్లో ఆలస్యానికి కారణం..

ఎంపీ రఘురామపై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌కు గతంలో విజయసాయిరెడ్డి లేఖ రాశారు. ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా వేటు వేయకపోవడం దురదృష్టకరమని అసహనం వ్యక్తం చేశారు. మొదటి విజ్ఞాపన సమర్పించిన 11 నెలల తర్వాత దాన్ని మరో విధానంలో ఇవ్వాలంటూ మీ కార్యాలయం నుంచి మాకు సమాచారం వచ్చింది. ఫిర్యాదులో ఏవైనా లోపాలుంటే ఆ విషయాన్ని రెండు పార్లమెంటు సెషన్ల తర్వాత కాకుండా ముందుగానే సమాచారం ఇచ్చి ఉండవచ్చు. ఏదేమైనా మీ కార్యాలయం సూచించినట్లుగానే ఆ ఫిర్యాదును సమర్పిస్తాం. రఘురామకృష్ణ రాజుపై అనర్హత ఫిర్యాదు పరిష్కారంలో జాప్యం వల్ల నరసాపురం లోక్‌సభ నియోజకవర్గ ప్రజలకు అన్యాయం జరుగుతోంది. ఒక అర్హత లేని వ్యక్తి ఆ ప్రాంత ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అనర్హత పిటిషన్‌పై ఆలస్యమనేది కె.మేఘా చంద్ర సింగ్‌ వర్సెస్‌ మణిపూర్‌ శాసనసభ సభాపతి కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు వ్యతిరేకంగా ఉందని అన్నారు.

ఇదీ చదవండి:

JAGAN PLAYED CRICKET: సీఎం జగన్​ బ్యాటింగ్​..ఎంపీ అవినాష్​ బౌలింగ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.