ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు తెలంగాణ ప్రజలకు బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు. సంస్కృతి, సంప్రదాయాలకు బోనాలు ప్రతిబింబమని ఆయన వ్యాఖ్యానించారు. బోనాల పండుగ ప్రజల ఐకమత్యానికి ప్రతీక అన్న వెంకయ్య.. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ వేడుక నిర్వహించుకోవాలని సూచించారు. ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.
గోల్కొండ నుంచి షురూ..
తెలంగాణలో బోనాల ఉత్సవాలు మొదలయ్యాయి. ఆనవాయితీ ప్రకారం గోల్కొండ ఆలయంలో బోనాలు ప్రారంభమయ్యాయి. తొలిరోజే అయినా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. దర్శనానికి వచ్చే భక్తులు కరోనా నిబంధనలు పాటించాలని అధికారులు సూచించారు. గోల్కొండ బోనాలకు పోలీసులు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశారు. 600 మందికిపైగా సిబ్బంది బందోబస్తు నిర్వహిస్తున్నారు. నేటి నుంచి వచ్చే నెల 8 తేదీ వరకు ఉత్సవాలు జరగనున్నాయి.
ఊరేగింపు..
ఉత్సవాల్లో భాగంగా లంగర్‌హౌస్ నుంచి తొట్టెల ఊరేగింపు నిర్వహించారు. మంత్రులు తలసాని, ఇంద్రకరణ్‌రెడ్డిలు ఈ ఊరేగింపులో పాల్గొని అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు.
ఇదీ చదవండి:
Audio Tape: నిరుద్యోగుల ఉద్యమానికి మద్దతు.. మావోయిస్టు అరుణ పేరిట ఆడియో టేపు!