ఇటీవల సమాజంలో జరుగుతున్న లైంగిక దాడుల ఘటనలు తనను కలిచి వేస్తున్నాయని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త చట్టాలు తీసుకొచ్చినంత మాత్రాన ఈ సమస్య పరిష్కారం కాదని... సమాజంలో మార్పు రావాలని అభిప్రాయపడ్డారు. నేరాలు, అత్యాచారాలు ఆగాలని పేర్కొన్నారు. ఫిర్యాదు తీసుకొని విచారణ చేయడం పోలీసుల మొదటి విధి అని... భయం, భక్తి ఉండాలని విలువలు కాపాడుకోవాలని సూచించారు.
హైదరాబాద్‌లోని ఎంసీఆర్ హెచ్ఆర్డీలో 94వ అల్ ఇండియా సర్వీస్, సెంట్రల్ సివిల్ సర్వీస్ అధికారుల ఫౌండేషన్ కోర్సు ముగింపు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథి ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ హాజరయ్యారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యమం నెలకొని ఉన్న భారత్‌పై ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు.
మన సంస్కృతి ఎంతో పురాతనమైనదని.. ప్రకృతి, సంస్కృతిని కాపాడుకుంటే అవి మన భవిష్యత్‌ను నిర్ణయిస్తాయని తెలిపారు. భారత సంస్కృతిని ప్రపంచ దేశాలు గౌరవిస్తాయన్న ఉపరాష్ట్రపతి... సంస్కృతి వీడటం వల్లే సమస్యలు తలెత్తుతున్నాయని చెప్పారు. ఈ సందర్భంగా పలు విభాగాల్లో ప్రతిభ కనబరిచిన సివిల్ సర్వెంట్లకు అవార్డులు ప్రదానం చేశారు.
ఇదీ చూడండి: 'దిశ'కు న్యాయం- సజ్జనార్ స్వస్థలంలో సంబరం