ETV Bharat / city

Venkaiah Naidu: 'రాజకీయాల్లో కులం, డబ్బు, నేరచరిత్ర కీలకంగా మారాయి' - ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు

Venkaiah Naidu: రాజకీయాల్లో కులం, డబ్బు, నేరచరిత్ర వంటి అంశాలు కీలకంగా మారాయని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో చక్కగా ఉండేవని అసహనం వ్యక్తం చేశారు. ఇతర భాషలు నేర్చుకోవాలి కానీ.. పరిపాలన, బోధన మాత్రం మాతృభాషలోనే ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. అర్థమయ్యే వారివద్ద మాతృభాషలో మాట్లాడకుంటే అది వ్యర్థమవుతుందన్నారు.

Venkaiah Naidu
Venkaiah Naidu
author img

By

Published : Mar 6, 2022, 9:23 PM IST

'రాజకీయాల్లో కులం, డబ్బు, నేరచరిత్ర కీలకంగా మారాయి'

Venkaiah Naidu: వేషధారణ, భాషను బట్టి మనుషుల స్థాయి పెరగదని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. తాను ఏదేశం వెళ్లినా పంచకట్టుతోనే వెళతానని పేర్కొన్నారు. అర్థమయ్యే వారివద్ద మాతృభాషలో మాట్లాడకుంటే అది వ్యర్థమవుతుందన్నారు. ఇతర భాషలు నేర్చుకోవాలి కానీ.. పరిపాలన, బోధన మాత్రం మాతృభాషలోనే ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. హైదరాబాద్​లోని ఎంసీఆర్​హెచ్​ఆర్​డీలో దర్శనమ్ ఆధ్యాత్మిక వార్తా మాసపత్రిక ఆధ్వర్యంలో భారత స్వాతంత్య్ర అమృత మహోత్సవాల్లో భాగంగా మరుమాముల దత్తాత్రేయ శర్మ రచించిన 'ముట్నూరి కృష్ణారావు గారి సంపాదకీయాలు' గ్రంథావిష్కరణ సభలో ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

అనేక మంది అమోఘమైన అసమాన ప్రతిభా పాఠవాలు కల్గివున్నారని.. వారిని తగినవిధంగా ప్రోత్సహించాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. వారిలో సామాజిక సేవ, దేశభక్తి కలిగించాలని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వాలు ఎలాగూ ప్రోత్సహించడం లేదని అసహనం వ్యక్తంచేశారు. గతంలో బ్రిటీష్ పాలనలో ఉన్నాం కాబట్టి బానిసలుగా ఉండేవారని.. ఇకనైనా బానిస మనస్తత్వం నుంచి బయటపడాలని హితవు పలికారు. గతంలో రాజకీయాలు చక్కగా ఉండేవని.. ప్రస్తుత రాజకీయాల్లో కులం, డబ్బు, నేరచరిత్ర వంటి అంశాలు కీలకంగా మారాయని ఆందోళన వ్యక్తం చేశారు. అటువంటివాటిని విడనాడేలా చర్యలు తీసుకోవాలన్నారు.

పరిపాలన, బోధనలో మాతృభాష ఉండాలి..

'యువకులకు సామాజిక సేవ, దేశభక్తి కలిగించాలి. బానిస మనస్తత్వం నుంచి బయటపడాలి. సమయాన్ని ఎవరూ వృథా చేసుకోవద్దు. జ్ఞానాన్ని, ఆస్తిని పెంచుకోవాలి.. పంచుకోవాలి. రాజకీయ నేతలు సైతం పత్రికలు పెట్టుకుంటున్నారు. పరిపాలనలో, బోధనలో మాతృభాష ఉండాలి. రాజకీయాల్లో క్యాష్, క్యాస్ట్‌, క్రిమినాలిటీ తీసుకొచ్చారు.' -వెంకయ్యనాయుడు, ఉపరాష్ట్రపతి

ఇదీ చదవండి: scholarships: విదేశాల్లో విద్యనభ్యసిస్తున్న వారికి ఉపకార వేతనాలు ఎప్పుడు..?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.