రాష్ట్రంలోని 8 జిల్లాల్లో 920 పాఠశాలల్లో కోయ భాషలో ప్రాథమిక విద్యా బోధన(Primary education in Koya language) అమలు చేస్తుండటంపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు(Vice President Venkaiah Naidu on koya language) హర్షం వ్యక్తంచేశారు. గిరిపుత్రుల మాతృభాషలోనే పుస్తకాలు రూపొందించి చదువు చెప్పేందుకు చొరవ తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రత్యేకించి విద్యాశాఖకు అభినందనలు తెలియజేస్తున్నట్లు ఆయన ట్వీట్ చేశారు. మాతృభాషలో బోధన అత్యంత ఆవశ్యకం అని అభిప్రాయపడ్డారు.
ఇదీ చదవండి..
ఎయి‘డెడ్’తో ఫీజులుం.. ప్రభుత్వ గ్రాంటు నిలిపివేత నిర్ణయంతో ఆందోళన