ETV Bharat / city

Venkaiah Naidu: 'విభజన హామీల అమలుపై దృష్టి పెట్టాలి' - విభజన హామీలు అమలు చేయాలని కిషన్​రెడ్డికి వెంకయ్య నాయుడు సూచన

Venkaiah Naidu: ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టానికి సంబంధించిన హామీల అమలు ప్రక్రియను వేగవంతం చేయాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డికి సూచించారు. అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి పర్యవేక్షిస్తేనే ప్రగతి పనులు వేగం పుంజుకుంటాయని తెలిపారు.

Venkaiah Naidu
వెంకయ్యతో కిషన్​రెడ్డి
author img

By

Published : Aug 9, 2022, 9:24 AM IST

Venkaiah Naidu: రాష్ట్ర పునర్విభజన ప్రాజెక్టుల పరిస్థితిని తెలుసుకుంటూ ఆయా శాఖల మంత్రులకు ఉపరాష్ట్రపతి మార్గదర్శనం చేస్తున్న విషయం విదితమే. ఇందులో భాగంగా కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖలకు సంబంధించిన కార్యక్రమాల పురోగతిపై ఆ శాఖల మంత్రి కిషన్‌రెడ్డితో ఉపరాష్ట్రపతి గత వారం సమీక్షించారు. అందుకు సంబంధించిన వివరాలను కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, ఆ శాఖల అధికారులు ఉపరాష్ట్రపతికి పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ రూపంలో సోమవారం తెలిపారు.

కాకినాడ సముద్ర ముఖద్వారంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, నెల్లూరు-పులికాట్‌-ఉబ్బలమడుగు జలపాతం, నేలపట్టు-కొత్తకూడూరు-మైపాడు-రామతీర్థం-ఇస్కపల్లి ప్రాజెక్టు, కోస్టల్‌, బుద్ధిస్ట్‌ సర్క్యూట్లు, గుంటూరు, అమరావతి నగరాల్లో పర్యాటక అభివృద్ధి, శ్రీశైలం, అన్నవరం, సింహాచలం ఆలయాల అభివృద్ధి, నెల్లూరులోని వేదగిరి నరసింహస్వామి ఆలయం, అరకు-విశాఖ విస్టాడోమ్‌ (రైల్వే) ప్రాజెక్టు, తిరుపతి రైల్వేస్టేషన్‌ అభివృద్ధి, పుట్టపర్తిలో సౌండ్‌ లైట్‌షో, ఉడాన్‌ పథకంలో విశాఖ-రాజమండ్రి, హైదరాబాద్‌-విద్యానగర్‌ (హంపి) మార్గాల పురోగతితోపాటు పలు పనుల పురోగతిని ఉపరాష్ట్రపతికి వివరించారు. ఈ ప్రాజెక్టుల విషయంలో తనకున్న సమాచారాన్ని, అనుభవాన్ని ఉపరాష్ట్రపతి అధికారులకు తెలిపారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.