ETV Bharat / city

తప్పుడు కథనాల ప్రచురణపై పీసీఐకి ఫిర్యాదు చేసిన వర్ల రామయ్య

తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(పీసీఐ), ఎడిటర్స్ గిల్ట్ లకు ఫిర్యాదు చేశారు. తెదేపా- భాజపాల విలీనమంటూ తప్పుడు కథనాలు ప్రచురించిన ఓ వార్తా పత్రికపై చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.

Varla Ramaiah
తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య
author img

By

Published : Apr 2, 2021, 9:56 AM IST

తెదేపా- భాజపాల విలీనమంటూ తప్పుడు కథనాలు ప్రచురించిన వార్తా పత్రికపై చర్యలు తీసుకోవాలని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య కోరారు. ఈ మేరకు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, ఎడిటర్స్ గిల్ట్​లకు ఫిర్యాదు చేశారు. అనుచిత రాతలను పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని.. వారు ప్రచురించిన కథనం జర్నలిస్టుల విలువలను దిగజార్చేలా ఉందన్నారు. ఇది ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్​ 2016 కోడ్ ఆఫ్​ కండక్ట్​కు విరుద్ధమన్నారు. కొంత మంది రాజకీయ నాయకులను మెప్పించేందుకే ఇలాంటి రాతలు రాశారని ఫిర్యాదులో తెలిపారు.

ఇదీ చదవండి: ఎస్​ఈసీ నిర్వహించే అఖిలపక్ష సమావేశాన్ని బహిష్కరిస్తున్నాం: పవన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.