ETV Bharat / city

పరీక్షలకు హాజరయ్యే ఇన్విజిలేటర్లకు వ్యాక్సిన్: మంత్రి సురేశ్ - Andhra Pradesh Latest News

ఇంటర్ పరీక్షలకు హాజరయ్యే ఇన్విజిలేటర్​లు అందరికీ వ్యాక్సిన్ వేసేలా చర్యలు తీసుకోవాలని.. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర సమగ్ర శిక్ష కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి అధికారులతో మాట్లాడారు.

మంత్రి ఆదిమూలపు సురేశ్
మంత్రి ఆదిమూలపు సురేశ్
author img

By

Published : Apr 30, 2021, 7:55 PM IST

పరీక్షల నిర్వహణలో అధికారులంతా ఎవరివంతు వారు బాధ్యతగా పనిచేయాలని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ కోరారు. ఇన్విజిలేటర్​లు అందరికీ వ్యాక్సిన్ వేసేందుకు చర్యలు ప్రారంభించామని మంత్రి తెలిపారు. దాదాపు 28 వేల మందికి వ్యాక్సిన్ వేసేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. ప్రభుత్వం చేపట్టిన వ్యాక్సిన్ ప్రక్రియలో భాగంగా ఇప్పటికే కొందరు వేయించుకున్నారని, మిగిలిన వారందరికీ వ్యాక్సిన్ వేసేందుకు చర్యలు తీసుకున్నామన్నారు.

పరీక్షా కేంద్రాల్లో థర్మల్ స్కానర్లు, మాస్క్​లు ఏర్పాటు చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు తక్షణమే జిల్లా వైద్య శాఖ అధికారులు పూర్తి చేయాలని సూచించారు. ప్రతి కేంద్రంలో ఒక ఐసొలేషన్ గదిని తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కనీసం ప్రతిచోట 5 పీపీఈ కిట్లు అందుబాటులో ఉంచాలని, ఏర్పాట్లతో పిల్లల ఆరోగ్య భద్రతపై తల్లిదండ్రులకు నమ్మకం ఏర్పడాలని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి జగన్​మోహన్ రెడ్డి కచ్చితమైన ఆదేశాలు ఇచ్చారని.. విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపట్టిన సంగతి ప్రజలకు తెలుసునన్నారు.

పరీక్షా కేంద్రాలకు చేరేందుకు అవసరమైన రవాణా సౌకర్యం ఏర్పాటు చేయాలని అధికారులను మంత్రి సురేశ్ ఆదేశించారు. ఆర్​ఐఓలు, ఆర్టీసీ అధికారులకు రూట్ మ్యాప్ ఇచ్చి అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. పరీక్షా కేంద్రాల వద్ద ఎక్కువ మంది గుమికూడకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకుని.. అవసరమైతే డ్యూటీలో పోలీసుల సంఖ్య పెంచాలని సూచించారు. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుని పరీక్షలు పూర్తి చేయాలని ఆదేశించారు.

ఇదీ చదవండీ... విద్యార్థుల భవిష్యత్‌ కోసమే పరీక్షల నిర్వహణ: సీఎం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.