ఆగస్టు 31 వరకు విద్యాసంస్థలకు అనుమతులు నిరాకరించింది ప్రభుత్వం. సినిమా హాళ్లు, స్విమ్మింగ్ పూల్స్, బార్లు తెరవకూడదని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. తగిన జాగ్రత్తలతో యోగా ట్రైనింగ్ సెంటర్లు, జిమ్ లకు ఇవాళ్టి నుంచి అనుమతి ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. స్వాతంత్య్ర దినోత్సవాలు కూడా భౌతిక దూరం పాటిస్తూ నిర్వహించాలని పేర్కొంది. కంటైన్మెంట్ జోన్లలో ఈ నెల 31 వరకు లాక్ డౌన్ కొనసాగింపు ఉంటుందని ప్రభుత్వం తెలిపింది.
ఇదీ చదవండి: శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ కథేంటి?