ETV Bharat / city

నేడు రాష్ట్ర పర్యటనకు రానున్న.. కేంద్ర జలవనరుల మంత్రి షెకావత్ - కేంద్ర జలవనరుల మంత్రి షెకావత్

Union Minister AP Tour: కేంద్ర జలవనరుల మంత్రి షెకావత్.. నేడు రాష్ట్ర పర్యటనకు రానున్నారు. రేపు సీఎం జగన్​తో కలిసి ఆయన పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు.

union minister shekhawat ap tour
union minister shekhawat ap tour
author img

By

Published : Mar 3, 2022, 4:30 AM IST

Updated : Mar 3, 2022, 6:07 AM IST

Union Minister AP Tour: కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ పోలవరం ప్రాజెక్టును సందర్శించి, ఉభయగోదావరి జిల్లాల్లోని పునరావాస కాలనీలను పరిశీలిస్తారు. ఇవాళ సాయంత్రం 6.30 గంటలకు దిల్లీ నుంచి ఆయన నేరుగా గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అనంతరం తాడేపల్లిలోని ముఖ్యమంత్రి జగన్‌ క్యాంపు కార్యాలయానికి వెళ్లి అక్కడ ఇద్దరూ సమావేశమవుతారు. గురువారం విజయవాడలోనే రాత్రి బస చేస్తారు. శుక్రవారం ఉదయమే హెలికాప్టర్‌లో బయలుదేరి తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలంలోని ఇందుకూరుపేట పునరావాస కాలనీకి వెళ్తారు. అక్కడ నిర్వాసితులతో కేంద్రమంత్రి మాట్లాడతారు. అనంతరం పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం తాడ్వాయి పునరావాస కాలనీకి చేరుకుంటారు. అక్కడ కూడా ప్రాజెక్టు నిర్వాసితులతో సంభాషిస్తారు. అనంతరం పోలవరం ప్రధాన డ్యాం నిర్మాణ ప్రాంతానికి వెళ్లి ప్రాజెక్టు పనులను పరిశీలిస్తారు.

పోలవరం స్పిల్‌ వే, ఎగువ-దిగువ కాఫర్‌ డ్యాంలు, ప్రధాన డ్యాం నిర్మించే ప్రాంతాలను సందర్శిస్తారు. తర్వాత అక్కడే రాష్ట్ర భాజపా బృందాన్ని ఉద్దేశించి షెకావత్‌ ప్రసంగించనున్నారు. అనంతరం పోలవరం అధికారులతో సమావేశమవుతారు. అక్కడి నుంచి తిరిగి విజయవాడ చేరుకుంటారు. భాజపా రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో పార్టీ నాయకులతో సమావేశం కానున్నారు. అనంతరం బెంగళూరు బయలుదేరి వెళ్తారు. ఈ పర్యటనలో షెకావత్‌ వెంట ఆయన సలహాదారు వెదిరే శ్రీరామ్‌ కూడా పాల్గొంటారని సమాచారం. ముఖ్యమంత్రి జగన్‌ సైతం కేంద్రమంత్రి షెకావత్‌తో పాటు పోలవరం పునరావాస కాలనీలు, ప్రధాన డ్యాం నిర్మాణ పరిశీలనకు వెళ్లనున్నారు. భాజపా కార్యక్రమాల్లో తప్ప ఇతర అన్ని కార్యక్రమాల్లోనూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌ కేంద్ర మంత్రి వెంట ఉండనున్నారు. పోలవరం అధికారులు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఈ పర్యటనకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇదీ చదవండి: High Court News: మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు పిటిషన్లపై నేడు హైకోర్టు తీర్పు

Last Updated : Mar 3, 2022, 6:07 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.