ఆంధ్రప్రదేశ్‌లో 13 నగరాలు కాలుష్య కోరల్లో చిక్కుకున్నాయని కేంద్రం తెలిపింది. 2014 నుంచి 2018 వరకు వివిధ నగరాల్లో గాలి నాణ్యతపై జరిపిన అధ్యయనంపై వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర పర్యావరణ శాఖ సహాయమంత్రి బాబుల్ సుప్రియో రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానమిచ్చారు.
ఏపీలో అనంతపురం, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నాల్లో స్వచ్ఛమైన గాలి నాణ్యత తక్కువగా ఉందని గుర్తించినట్లు తెలిపారు.
ఇదీ చదవండి: