రాష్ట్ర రాజధాని నగరాన్ని నిర్ణయించేది సంబంధిత రాష్ట్ర ప్రభుత్వమని.. ఈ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వానికి పాత్ర ఉండదని పేర్కొంటూ గతంలో వేసిన కౌంటర్‌ను రాజధాని వ్యవహారంపై దాఖలైన మిగిలిన వ్యాజ్యాలకు అన్వయిస్తూ కేంద్ర ప్రభుత్వం హైకోర్టులో మెమో దాఖలు చేసింది. గత విచారణ సందర్భంగా మిగిలిన వ్యాజ్యాల్లోనూ వైఖరి తెలియజేయాలని త్రిసభ్య ధర్మాసనం కేంద్రాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే. పాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలను సవాలు చేస్తూ.. దాఖలైన ఓ వ్యాజ్యంలో రాయలసీమ ప్రాంత వాసిగా తనను ప్రతివాదిగా చేర్చుకొని ఇంప్లీడ్ వాదనలు వినిపించేందుకు తావివ్వాలంటూ న్యాయవాది శివారెడ్డి హైకోర్టులో అనుబంధ పిటిషన్ వేశారు. మొదటి నుంచి రాయలసీమకు అన్యాయం జరుగుతోందన్నారు శివారెడ్డి.
ఇదీ చదవండి... సబ్బంహరి ఇంటిని కూల్చడంపై అంత సైకోయిజం ఏంటి: చంద్రబాబు