ETV Bharat / city

UNEMPLOYES SUICIDE : నిరుద్యోగుల ఆత్మహత్యలు పెరిగాయ్‌!

ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులు, రోజు కూలీల బలవంతపు చావులు పెరిగాయి. 2019తో పోలిస్తే 2020లో నిరుద్యోగుల ఆత్మహత్యలు 67.28 శాతం, రోజు కూలీల బలవన్మరణాలు 15.41 శాతం ఎక్కువయ్యాయి. దేశంలో రోజు కూలీలు అత్యధికంగా ఆత్మహత్యలు చేసుకున్న రాష్ట్రాల జాబితాలో ఏపీ ఆరో స్థానంలో ఉంది.

నిరుద్యోగుల ఆత్మహత్యలు
నిరుద్యోగుల ఆత్మహత్యలు
author img

By

Published : Oct 30, 2021, 5:46 AM IST

రాష్ట్రంలో 2019లో 214 మంది నిరుద్యోగులు బలవన్మరణాలకు పాల్పడగా..2020లో ఆ సంఖ్య 358కి చేరింది. 2019లో 2,167 మంది రోజు కూలీలు ఆత్మహత్య చేసుకోగా 2020లో ఆ సంఖ్య 2,501కి పెరిగింది. గతేడాది రాష్ట్రంలో రోజుకు సగటున 6-7 మంది రోజు కూలీలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. జాతీయ నేర గణాంక సంస్థ తాజాగా విడుదల చేసిన ‘‘ప్రమాద మరణాలు- ఆత్మహత్యల సమాచార వార్షిక నివేదిక-2020’’ ఈ వివరాలు వెల్లడించింది. గతేడాది రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 7,043 మంది బలవన్మరణానికి పాల్పడ్డారు. వారిలో 2,501 మంది (35.51 శాతం) మంది రోజు కూలీలే కావటం తీవ్రతకు అద్దం పడుతోంది. వీరిలో ఎక్కువ మంది అల్పాదాయం, కుటుంబ సమస్యలతోనే బతుకు ముగించుకున్నారు.

అనారోగ్యం.. కుటుంబ సమస్యలు...అప్పులు

* గతేడాది రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న వారిలో 4,871 మంది (69.16 శాతం) అనారోగ్యం, కుటుంబ సమస్యలు, అప్పుల వల్లే ప్రాణాలు తీసుకున్నారు.

* బలవంతపు చావులకు పాల్పడిన వారిలో 5,488 మంది (77.92 శాతం) వివాహితులే.

* అతి తక్కువ ఆదాయం కలిగిన వర్గాల్లోనే ఎక్కువ బలవన్మరణాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రాణాలు తీసుకున్న వారిలో 3,902 మంది (55.40 శాతం) రూ.లక్ష అంతకంటే తక్కువ ఆదాయం కలిగిన వారే.

ఇవీచదవండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.