ETV Bharat / city

తెలంగాణలో ఎదురుకాల్పులు.. నలుగురు మావోయిస్టులు మృతి - mulugu news

Two Maoists killed in Police Encounter
Two Maoists killed in Police Encounter
author img

By

Published : Jan 18, 2022, 9:41 AM IST

Updated : Jan 18, 2022, 1:38 PM IST

09:39 January 18

ములుగు జిల్లాలో ఎన్​కౌంటర్

Maoists killed: పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఈ ఘటన తెలంగాణలోని ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో చోటు చేసుకుంది. కర్రెగుట్ట అటవీ ప్రాంతంలో పోలీసులకు, మావోయిస్టులు తారసపడడంతో కాల్పులు జరిగాయి. మావోయిస్టులకు పోలీసులకు మధ్య ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయి.

చనిపోయిన వారిలో సుధాకర్
ఈ కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందగా.. వారిలో జీఎండబ్ల్యూపీ డివిజన్ కమిటీ సభ్యుడు సుధాకర్ మృతి చెందినట్లు సమాచారం. మావోయిస్టులు జరిపిన కాల్పుల్లో గ్రేహౌండ్స్​ కానిస్టేబుల్​కు గాయాలయ్యాయి. కానిస్టేబుల్​ను చికిత్స కోసం హెలికాప్టర్​లో హైదరాబాద్​కు తీసుకువస్తున్నారు. సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి అదనపు బలగాలను తరలించారు. మరణించిన వారిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇదీ చదవండి

LAND REGISTRATIONS:37 గ్రామాల్లో రిజిస్ట్రేషన్‌ సేవలను ప్రారంభించనున్న సీఎం

Last Updated : Jan 18, 2022, 1:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.