Ganja Seized : సంగారెడ్డి జిల్లాలో భారీగా ఎండు గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సుమారు రెండు కోట్ల విలువైన వెయ్యి కిలోల గంజాయిని పట్టుకున్నారు. ఓ అంతరాష్ట్ర ముఠాను అదుపులోకి తీసుకున్నారు.
ఏపీలోని రాజమహేంద్రవరం నుంచి మహారాష్ట్రలోని నాందేడ్‌కి లారీలో గంజాయిని తరలిస్తున్నారన్న సమాచారం పోలీసులు అందింది. ఈ మేరకు నిఘాపెట్టిన పోలీసులు సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం నందికంది వద్ద ఉదయం 4 గంటల సమయంలో గంజాయి అక్రమ రవాణా ముఠాసభ్యులు షేక్ సలీం, అజీజ్ కాస్ సహా లారీని స్వాధీనం చేసుకున్నారు.
మహారాష్ట్రకు చెందిన ఆజాద్ అనే వ్యక్తి.. నిందితులు ఇద్దరితో రెండు లక్షలకు బేరం మాట్లాడుకున్నారని.. అడ్వాన్స్‌గా రూ.50 వేలు ఇచ్చినట్లు గుర్తించామని పోలీసులు తెలిపారు. లారీలో మొత్తం 500 ప్యాకెట్లు ఉన్నాయని.. ఒక్కోటి రెండు కిలోలు ఉందని పోలీసులు తెలిపారు. గంజాయి అక్రమ రవాణా సహా ఇతర అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు. ఈ సందర్భంగా డీఎస్పీ బాలాజీ, సీఐ సంతోష్‌కుమార్, ఇతర సిబ్బందిని అభినందించారు.
ఇదీ చదవండి : FLAG HOSTING GOVERNOR:అన్నివర్గాల అభివృద్ధే లక్ష్యంగా పాలన: గవర్నర్ బిశ్వభూషణ్
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!