ETV Bharat / city

సాగర్​కు భారీ వరద... 12 గేట్ల ఎత్తివేత

నాగార్జునసాగర్ జలాశయంలో మరిన్ని క్రస్ట్ గేట్స్ తెరుచుకున్నాయి. ఎగువ నుంచి భారీ వరద వస్తున్న నేపథ్యంలో అధికారులు 12 క్రస్ట్ గేట్లను 10 అడుగుల మేర ఎత్తారు. ఫలితంగా 1,57,613 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

nagarjuna-sagar-project-lifted-again
nagarjuna-sagar-project-lifted-again
author img

By

Published : Sep 11, 2020, 9:28 PM IST

నాగార్జునసాగర్ జలాశయం నిండుకుండలా మారింది. శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి నాగార్జునసాగర్​కు 2 లక్షల 13 వేల 034 క్యూసెక్కుల వరద వస్తోంది. సాగర్ జలాశయం మొత్తం నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 589.90 అడుగులుగా కొనసాగుతోంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు పూర్థి స్థాయి నీటి నిల్వ 312.04 టీఎంసీలు కాగా ప్రస్తుతం 311.20 టీఎంసీలుగా ఉంది.

సాగర్​కు భారీ వరద... 12 గేట్ల ఎత్తివేత

విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ద్వారా..

నాగార్జునసాగర్ ప్రధాన విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ద్వారా 21 వేల క్యూసెక్కుల నీరు, సాగర్ కుడి కాల్వకు 7 వేల 878 క్యూసెక్కుల నీరు, ఎస్ఎల్​బీసీ ద్వారా 1800 క్యూసెక్కుల నీరు మొత్తం కలిపి సాగర్ నుంచి ఔట్ ఫ్లోగా విడుదల చేశారు. నాగార్జునసాగర్ జలాశయం క్రస్ట్ గేట్లను గత నెల నుంచి నేటికి 3 సార్లు ఎత్తారు.

ఇవీ చూడండి :

అరుదైన సీతాకోకచిలుక... విశేషంగా ఆకట్టుకునేనమ్మా..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.