అమరావతి కోసం.. ఆందోళన బాటలోనే తుళ్లూరు జనం - తుళ్లూరులో కొనసాగుతోన్న ప్రజాందోళన
రాజధాని అమరావతి పరిధిలోని తుళ్లూరులో 30వ రోజు ప్రజాందోళన కొనసాగుతోంది. రైతులు, మహిళలు పెద్ద ఎత్తున నిరసన దీక్షలో పాల్గొన్నారు. రాజధానిగా అమరావతినే కొనసాగించాలని నినదించారు. మూడు రాజధానుల ప్రతిపాదనపై ప్రభుత్వం వెనక్కి తగ్గే వరకు పోరాటం ఆపేది లేదని స్పష్టం చేశారు.
tulluru farmers protest news