మూడు రాజధానుల ప్రతిపాదనను విరమించుకోవాలని కోరుతూ... తుళ్లూరులో రైతుల మహాధర్నా కొనసాగుతోంది. రైతులు, మహిళలు నల్ల దుస్తులతో దీక్షలో పాల్గొన్నారు. రాజధానిపై ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోకుంటే... దేశవ్యాప్తంగా రైతులందరినీ సంఘటితం చేసి పోరాటం ఉద్ధృతం చేస్తామని రైతులు హెచ్చరించారు. దిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ఆందోళన నిర్వహిస్తామని... పరిస్థితిని ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు.
ఇవీ చదవండి: