Tulasireddy challenge to Jagan: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని భాజపా మోసం చేసిందని పీసీసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి అన్నారు. ఆ పార్టీ భారతీయ జనతా పార్టీగా కాకుండా.. భారతీయ మోసగాళ్ల పార్టీలా మారిందని విమర్శించారు. కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా చేస్తామన్న జగన్ మాటలన్నీ ఏమయ్యాయని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రయోజనాలు పక్కనపెట్టి.. మోదీకి జగన్ భజన చేస్తున్నారని అనంతపురంలో ఆయన మండిపడ్డారు.
Tulasireddy challenge to Jagan: రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని డిమాండ్ చేశారు. చేతగాని ఎంపీలు రాజీనామాలు చేయాలన్నారు. ప్రాంతీయ పార్టీల తీరు సరిగా లేదని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలో ఉంటే ప్రత్యేక హోదాతో పాటు రాయలసీమకు బుందేల్‌ఖండ్ తరహా ప్యాకేజీ ఇచ్చేవారమని తెలిపారు. కేంద్రంపై వైకాపా అవిశ్వాస తీర్మానం పెట్టాలని జగన్‌కు సవాల్ విసిరారు.
ఇదీ చదవండి:
Telangana Letter To KRMB: 'కృష్ణా జలాల్లో చెరిసగం వాడుకునేలా చూడాలి..'