ETV Bharat / city

తెలంగాణ ఆర్టీసీ సమ్మె: డిపోలకు కార్మికులు.. అడ్డుకుంటున్న పోలీసులు - tsrtc strike news

తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించి డిపోలకు తరలివస్తున్నారు. ప్రభుత్వం నుంచి అనుమతి లేక కార్మికులను పోలీసులు అడ్డుకుంటున్నారు.

rtc agitation
rtc agitation
author img

By

Published : Nov 26, 2019, 9:01 AM IST

Updated : Nov 26, 2019, 12:11 PM IST

తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం 52రోజులుగా చేస్తున్న సమ్మెను విరమించిన ఆర్టీసీ కార్మికులు విధుల్లోకి చేర్చుకోవాలంటూ డిపోలకు తరలివస్తున్నారు. అయితే విధుల్లో చేరే విషయంలో ప్రభుత్వం నుంచి అనుమతి లేదని అధికారులు వారిని చేర్చుకోవడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిపోల వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. విధుల్లోకి వచ్చిన సిబ్బందిని పోలీసులు అడ్డుకుంటున్నారు. ఫలితంగా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల ఉద్రిక్తత నెలకొంది.

ఆర్టీసీ కార్మికులను విధుల్లోకి చేర్చుకుంటారా?

తాత్కాలిక సిబ్బందితో అధికారులు బస్సులు నడిపిస్తున్నారు. పలుచోట్ల బస్సులు బయటకు పోకుండా కార్మికులు అడ్డుకునే ప్రయత్నం చేయగా పోలీసులు వారిని అరెస్టు చేశారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా.. అన్ని డిపోల వద్ద పోలీసులు 144 సెక్షన్​ను అమలు చేశారు. విధుల్లోకి వస్తున్న తాత్కాలిక కార్మికులను మాత్రమే అనుమతించాలని... సమ్మెలో పాల్గొన్న ఉద్యోగులకు ప్రవేశం లేదని ఆర్టీసీ ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.

రోజులాగానే తాత్కాలిక సిబ్బందితో బస్సులు నడుస్తున్నాయి. శాంతియుతంగా విధులు నిర్వహించేందుకు వస్తున్న తమను అక్రమంగా అరెస్ట్​ చేస్తున్నారని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని డిపోల వద్ద నిరసనలకు దిగిన కార్మికులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాదాపు అన్ని డిపోల వద్ద సిబ్బందిని అదుపులోకి తీసుకొన్నారు. ఈ సందర్భంగా పలుచోట్ల ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.

ఆగిన మరో గుండె..
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఓ ఆర్టీసీ కార్మికుడు గుండెపోటుతో ఈ రోజు మృతి చెందాడు. ఎడపల్లి మండలం మంగల్​పాడ్ గ్రామానికి చెందిన రాజేందర్ బోధన్ డిపోలో డ్రైవర్​గా పని చేస్తున్నాడు. నిన్న ఉదయం గుండెనొప్పితో నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరాడు. చికిత్స పొందుతూ ఈ రోజు మరణించాడు. 50 రోజులకు పైగా కార్మికులు సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల రాజేందర్ తీవ్ర మనస్తాపానికి గురయ్యారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

sample description
Last Updated : Nov 26, 2019, 12:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.