తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె విరమణ - ఆర్టీసీ కార్మికుల సమ్మె విరమణ
డిమాండ్ల పరిష్కారం కోసం 52 రోజులుగా సమ్మె చేస్తున్న తెలంగాణ ఆర్టీసీ కార్మికులు.. ఆందోళన నుంచి విరమించారు. ఈ విషయాన్ని ఐకాస కన్వీనర్ అశ్వత్థామరెడ్డి ప్రకటించారు. రేపు కార్మికులందరూ డిపోలకు చేరుకోవాలని సూచించారు. రెండో షిఫ్టులో ఉన్న కార్మికులు కూడా ఉదయమే డిపోలకు చేరుకోవాలని తెలిపారు. ఆర్టీసీ సమ్మె దిగ్విజయంగా కొనసాగిందని... సమ్మెలో నైతిక విజయం కార్మికులదేనని స్పష్టం చేశారు. సమ్మెలో కార్మికులు ఓడిపోలేదు.. ప్రభుత్వం గెలువలేదని అశ్వత్థామరెడ్డి వ్యాఖ్యానించారు. సమ్మె విరమించినందున తాత్కాలిక డ్రైవర్లు విధుల్లోకి రావొద్దని కోరారు.
tsrtc labor called of strike in telangna