ETV Bharat / city

తెలంగాణలో రేపటినుంచి రోడ్లపైకి బస్సులు!

తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులు మళ్లీ రోడ్డెక్కనున్నాయి. మంగళవారం నుంచి ప్రజారవాణా సేవలు ప్రారంభం కానున్నాయి. కేంద్ర తాజా మార్గదర్శకాల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బస్సులు నడిపించాలని నిర్ణయించింది. ఇవాళ సాయంత్రం సీఎం కేసీఆర్ అధ్యక్షతన మంత్రిమండలి సమావేశం జరగనుంది. ఆర్టీసీ బస్సులకు అనుమతివ్వటంతో పాటు లాక్‌డౌన్‌ విషయంలో అనుసరించాల్సిన వ్యూహంపై సమావేశంలో చర్చించనున్నారు.

tsrtc-buses-to-start-from-tomorrow
తెలంగాణలో రేపటినుంచి రోడ్లపైకి బస్సులు!
author img

By

Published : May 18, 2020, 11:47 AM IST

కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా లాక్‌డౌన్‌ చేపట్టిన తెలంగాణ ప్రభుత్వం మార్చి నాలుగోవారం నుంచి బస్సులను నిలిపి వేసింది. తాజాగా కేంద్రం వెసులుబాటు కల్పించినందున మంగళవారం నుంచి బస్సులు నడపాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇవాళ సాయంత్రం ముఖ్యమంత్రి కేసీఆర్​ అధ్యక్షతన జరగనున్న కేబినెట్​ భేటీలో ఈ విషయమై నిర్ణయం తీసుకునే అవకాశముంది. ఆర్టీసీ బస్సులకు అనుమతివ్వటంతో పాటు లాక్‌డౌన్‌ విషయంలో అనుసరించాల్సిన వ్యూహంపై సమావేశంలో చర్చించనున్నారు.

ఆర్టీసీ అధికారులతో పువ్వాడ సమావేశం..

ఈరోజు తెలంగాణ రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ అధ్యక్షతన ఆర్టీసీ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ఆర్టీసీ వర్గాలకు దీనిపై ఆదివారం రాత్రి సమాచారమిచ్చింది. సమావేశంలో బస్సుల నిర్వహణ ప్రణాళికను సిద్ధం చేసి సాయంత్రం జరిగే మంత్రిమండలి సమావేశంలో నివేదిస్తారని తెలిసింది. దీనిపై మంత్రిమండలి సమగ్రంగా చర్చించి, బస్సులు నడిపేందుకు అనుమతించే అవకాశం ఉన్నట్లు సమాచారం. వాస్తవానికి ఇప్పటికే 50 శాతం బస్సులను తిప్పేందుకు కేంద్ర అనుమతులున్నా వైరస్ వ్యాపిస్తుందనే భయంతో ప్రభుత్వం నడపలేదు.

ఆరెంజ్, గ్రీన్​ జోన్లు పెరిగినందుకే..

తాజాగా రాష్ట్రంలో ఆరెంజ్‌, గ్రీన్‌ జోన్ల సంఖ్య పెరగటంతో బస్సులు నడపాలనే భావిస్తోంది. కంటైన్మెంట్​ జోన్లు మినహా గ్రామీణ, జిల్లా, రాజధానికి నడిచే బస్సు సేవలు, వాటిల్లో పరిమితంగా ప్రయాణికులను అనుమతించడం, వ్యక్తిగత దూరం పాటించడం వంటి జాగ్రత్తలు తీసుకుంటారు. ఇతర రాష్ట్రాలకు బస్సు సర్వీసులపై ఇంకా స్పష్టత రాలేదు. ఆయా రాష్ట్రాల పరిస్థితులు, సమన్వయం ఇతర అంశాల ఆధారంగా తదుపరి నిర్ణయం తీసుకునే వీలుంది. సమావేశంలో కేంద్రమిచ్చిన ఇతర సడలింపులనూ పరిశీలించనున్నారు.

ఇదీ చదవండి: డ్వాక్రా మహిళలపై వడ్డీల భారం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.