ETV Bharat / city

తెలంగాణ సీఎం కేసీఆర్​కు హైకోర్టు నోటీసులు.. ఎందుకంటే..! - సీఎం కేసీఆర్​కు నోటీసులు

Court Notices to CM KCR: తెరాస కార్యాలయాలకు భూ కేటాయింపులపై తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ఆ రాష్ట్ర హైకోర్టు నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లో పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని న్యాయస్థానం ఆదేశించింది.

High Court notices to KCR
High Court notices to KCR
author img

By

Published : Jun 23, 2022, 4:12 PM IST

TS High Court Notices to CM KCR: ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. జిల్లాల్లో తెరాస కార్యాలయాలకు భూ కేటాయింపులపై రిటైర్డ్‌ ఉద్యోగి మహేశ్వర్‌రాజ్‌ దాఖలు చేసిన పిల్‌పై న్యాయస్థానం విచారణ చేపట్టింది. తెరాస హైదరాబాద్‌ కార్యాలయం కోసం బంజారాహిల్స్​లో 4,935 గజాలు ఇవ్వడం.. అత్యంత ఖరీదైన భూమిని గజం రూ.100కే కేటాయించడంపై పిటిషనర్‌ హైకోర్టును ఆశ్రయించారు.

ఈ పిటిషన్​పై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం తెరాస అధినేత సీఎం కేసీఆర్‌, పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డితో పాటు సీఎస్‌, సీసీఎల్‌ఏ, హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్​కు ఉన్నత న్యాయస్థానం నోటీసులు ఇచ్చింది. నాలుగు వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. పూర్తి వివరాలతో వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఆదేశించింది.

అసలేం జరిగిందంటే..: తెరాస హైదరాబాద్ జిల్లా కార్యాలయం నిర్మాణం కోసం బంజారాహిల్స్ ఎన్​బీటీ నగర్​లో 4,935 చదరపు గజాల భూమిని మే 11న ప్రభుత్వం కేటాయించింది. వేల కోట్ల రూపాయల విలువైన భూమిని కేవలం గజానికి వంద రూపాయలకే తెరాసకు కేటాయించడాన్ని సవాల్ చేస్తూ విశ్రాంత ఉద్యోగి, అఖిల భారత ఎస్సీ, ఎస్టీల సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు కె.మహేశ్వర్​ రాజ్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్రశర్మ, జస్టిస్ అభినంద్ కుమార్ షావిలి ధర్మాసనం విచారణ చేపట్టింది. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు జిల్లా కేంద్రాల్లో వంద రూపాయలకు గజం చొప్పున ఎకరానికి మించకుండా స్థలం కేటాయించేందుకు 2018లో ఆగస్టు 16న జారీ చేసిన జీవో రాజ్యాంగ విరుద్ధమని పిటిషనర్ తరఫు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వాదించారు.

ఆ జీవోకు అనుగుణంగానే బంజారాహిల్స్​లో అత్యంత ఖరీదైన భూమిని తెరాసకు అతి చౌకగా కేటాయించడం హేతుబద్ధంగా లేదన్నారు. బంజారాహిల్స్​లోనే తెరాసకు 2005 అప్పటి ప్రభుత్వం కేటాయించిన ఎకరం స్థలంలో నిర్మించిన రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో నిబంధనలకు విరుద్ధంగా టీవీ చానెల్ నిర్వహిస్తున్నారని పిటిషన్​లో ఆరోపించారు. అదే భవనంలో జిల్లా కార్యాలయం నిర్వహించకుండా సమీపంలోనే సుమారు 110 కోట్ల రూపాయల విలువైన భూమిని కేవలం 4,93,500 రూపాయలకే కేటాయించడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమన్నారు.

తెరాసకు 361 కోట్ల రూపాయల డిపాజిట్లు సహా 891 కోట్ల రూపాయల విలువైన ఆస్తులు ఉన్నాయని పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఇటీవల ప్లీనరీలో వెల్లడించారన్నారు. భూమి కోసం 110 కోట్లు చెల్లించే స్థితిలో ఉన్నప్పటికీ చౌక ధరకు కేటాయించడం రాజ్యాంగానికి, సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధమని న్యాయవాది వాదించారు. ముఖ్యమంత్రిగా ఉన్న తెరాస అధ్యక్షుడు కేసీఆర్ ప్రభావంతో సీఎస్, ఇతర అధికారులు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని పిటిషనర్ ఆరోపించారు. వంద రూపాయలకు గజం చొప్పన జిల్లా కేంద్రాల్లో రాజకీయ పార్టీలకు భూమిని కేటాయించాలనే జీవోతో పాటు... బంజారాహిల్స్​లో తెరాసకు భూకేటాయింపు జీవోలను కొట్టివేయాలని కోరారు. బంజారాహిల్స్ భూమిలో నిర్మాణాలు చేపట్టకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఇవీ చూడండి : డబ్బుల్లేవ్.. "దుల్హన్‌" పథకం నిలిపేస్తున్నాం: జగన్ సర్కారు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.