ETV Bharat / city

TS High Court: అత్యాచారంతో గర్భం దాల్చిన బాలిక.. తొలగింపునకు హైకోర్టు అనుమతి - High Court allows abortion of raped girl

అత్యాచార బాధితురాలి గర్భం తొలగింపుపై తెలంగాణ హైకోర్టు సమ్మతినిచ్చింది. పిండం హక్కుల కంటే అత్యాచార బాధితురాలి హక్కులే ముఖ్యమని ధర్మాసనం తేల్చిచెప్పింది.

TS High Court
TS High Court
author img

By

Published : Oct 7, 2021, 9:54 PM IST

Updated : Oct 8, 2021, 7:53 AM IST

కుటుంబానికి చెందిన వ్యక్తి కారణంగా ఓ 16 ఏళ్ల బాలిక దాల్చిన గర్భాన్ని తొలగించేందుకు కోఠి ప్రభుత్వ ఆసుపత్రికి తెలంగాణ హైకోర్టు అనుమతినిచ్చింది. నిపుణులైన వైద్య బృందం ఆధ్వర్యంలో ఈ గర్భవిచ్ఛిత్తి చేపట్టాలని ఆదేశించింది. పిండం నుంచి టిష్యూ, రక్త నమూనా, డీఎన్‌ఏను సేకరించి భద్రపరచాలని ఆదేశించింది. బాధిత బాలికపై కుటుంబానికి చెందిన వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని బయటపెడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందంటూ బెదిరించి నోరు నొక్కేశాడు. సెప్టెంబరు 9న బాలిక అనారోగ్యానికి గురికాగా.. కోఠి ఆసుపత్రికి కుటుంబ సభ్యులు తీసుకెళ్లారు. గర్భం దాల్చినట్లు (పిండం వయసు 25 వారాలు) తేలింది. దీనిపై తల్లిదండ్రులు ఆరా తీయగా.. ఆంజనేయులు అనే వ్యక్తి కారణమని చెప్పడంతో అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలికకు గర్భవిచ్ఛిత్తి చేసేందుకు గడువు దాటిపోయిందంటూ ఆసుపత్రి నిరాకరించడంతో బాధితురాలు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారించిన జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డి నిపుణుల సిఫార్సు నివేదికను పరిశీలించి గర్భవిచ్ఛిత్తి చేసేందుకు ఆసుపత్రికి అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేశారు.

చట్టప్రకారం పరిమితులకు లోబడి..

మెడికల్‌ టెర్మినేషన్‌ ఆఫ్‌ ప్రెగ్నెన్సీ చట్టం ప్రకారం పిండం వయసు 24 వారాల కంటే ఎక్కువ ఉండకూడదని, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నపుడు గర్భవిచ్ఛిత్తికి ఆదేశాలిచ్చే అధికారం రాజ్యాంగ కోర్టులకు ఉందని న్యాయమూర్తి పేర్కొన్నారు. పిండం హక్కులతో పోల్చినపుడు అత్యాచారానికి గురైన బాలికకు రాజ్యాంగం కల్పించిన హక్కులకే ప్రాధాన్యం ఉందన్నారు. 16 ఏళ్ల బాలిక మానసిక ఒత్తిడితో గర్భాన్ని కొనసాగిస్తే పుట్టబోయే శిశువు ఆరోగ్యంగా ఉంటుందని చెప్పలేమన్నారు. తల్లీబిడ్డలకు వైద్యపరమైన సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయన్నారు. ఈ నేపథ్యంలో పుట్టబోయే శిశువు జీవితాన్ని బాలిక జీవితం కంటే ఉన్నతంగా చూడలేమన్నారు. మహిళ ఆత్మగౌరవం, ఆరోగ్యకర జీవనం రాజ్యాంగం కల్పించిన హక్కులన్నారు. అవాంఛనీయ, అత్యాచార, లైంగిక దోపిడీవల్ల వచ్చిన గర్భాన్ని చట్టప్రకారం కొన్ని పరిమితులకు లోబడి తొలగించుకోవచ్చన్నారు.

ఇదీ చదవండి:

RAPE: చాక్లెట్​ ఆశ చూపి.. ఇద్దరు బాలికలపై అత్యాచారం

Last Updated : Oct 8, 2021, 7:53 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.