ETV Bharat / city

రాజధాని మార్పు, ఆంధ్రాలో పరిస్థితులపై కేటీఆర్‌ విమర్శలు - ktr clarity on cm post

ఏపీ రాజధాని అంశంపై తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్పందించారు. జనసేన అంతర్జాతీయ పార్టీ అయినా తమకు సంబంధం లేదని ఎద్దేవా చేశారు. త్వరలోనే తాను సీఎం అవుతాననేది ఊహాగానాలేనని కొట్టిపడేశారు. హైదరాబాద్ తెలంగాణ భవన్​లో కేటీఆర్ ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు.

Ktr
కేటీఆర్
author img

By

Published : Jan 17, 2020, 5:50 PM IST

Updated : Jan 17, 2020, 7:04 PM IST

ఏపీ రాజధాని మార్చుతామంటేనే ఆందోళనలు జరుగుతున్నాయని.. తెలంగాణలో చిన్న ఆందోళన లేకుండా జిల్లాల విభజన జరిగిందని.. అది తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వం వల్లే సాధ్యమైందని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ వ్యాఖ్యానించారు. కొత్త జిల్లాలు ఏర్పడటం వల్ల అధికార వికేంద్రీకరణ జరిగిందన్నారు. తాను త్వరలోనే సీఎం అవుతాననేది ఊహాగానాలేనని పేర్కొన్నారు. సీఎం పదవి గురించి మీడియా వాళ్లే మంత్రులతో మాట్లాడిస్తున్నారని తెలిపారు. తెలంగాణ భవన్​లో కేటీఆర్​ ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు.

రాజధాని మార్పు, ఆంధ్రాలో పరిస్థితులపై కేటీఆర్‌ విమర్శలు

పవన్​ ఏం చేసిన మాకు అవసరం లేదు

జనసేన అంతర్జాతీయ పార్టీ అయినా తమకు సంబంధం లేదని.. పవన్ కల్యాణ్ ఏం చేసినా ఏపీ ప్రజలే చూసుకుంటారని కేటీఆర్ పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో భాజపాకు అభ్యర్థులే కరవయ్యారని... కాంగ్రెస్, భాజపాలు బీ ఫారాలు ఇస్తామన్నా తీసుకోవడానికి ముందుకు రావడం లేదన్నారు. కాంగ్రెస్, భాజపా లోపాయకారీ పొత్తులు పెట్టుకుని.. బయటకు డ్రామాలు చేస్తున్నాయని కేటీఆర్ దుయ్యబట్టారు. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం చేసిందేమీ లేదన్నారు.

లక్ష్మణ్​ నిధులు తెచ్చారా?

తెలంగాణలో కట్టినట్లుగా రెండు పడక గదుల ఇళ్లు.. భాజపా పాలిత రాష్ట్రాల్లో కట్టారా చెప్పాలని కిషన్ రెడ్డికి సవాల్ చేశారు. కిషన్ రెడ్డి కొల్లూరు వస్తే... ఎర్ర తివాచీ పరచి డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణాలు చూపిస్తానన్నారు. ఐదేళ్లలో కేంద్రం నుంచి తెలంగాణ భాజపా అధ్యక్షుడు లక్ష్మణ్​ ఏమైనా అదనపు నిధులు తెచ్చారా అని ప్రశ్నించారు. తమది ఉద్యోగులకు అనుకూల ప్రభుత్వమని... నివేదిక వచ్చాక పీఆర్సీపై నిర్ణయం తీసుకుంటామన్నారు.

సమయానికి జీహెచ్​ఎంసీ ఎన్నికలు

జీహెచ్ఎంసీలో ముందుస్తు ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం లేదని... ఈసారీ తమదే విజయమని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీని విభజించాలన్నది తన వ్యక్తిగత అభిప్రాయమని.. ప్రభుత్వానికి సంబంధం లేదన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు తెరాసకు ఓటేయాలని కోరిన కేటీఆర్.. కొత్త మున్సిపల్ చట్టాన్ని కఠినంగా అమలు చేస్తామన్నారు. రానున్న నాలుగేళ్లు పాలనపై పూర్తి దృష్టి సారిస్తామన్నారు.

ఇదీ చూడండి:

'ఈ నెల 20 వరకు అభ్యంతరాలు తీసుకోండి- సీఆర్డీఏకు హైకోర్టు ఆదేశం '

TG_HYD_16_17_KTR_ON_MUNCIPALITIES_revised_AV_3064645 reporter: Nageshwara Chary note: pls use ktr file vis ( ) ఏపీలో రాజధాని మార్చుతామంటేనే ఆందోళనలు జరుగుతున్నాయని.. తెలంగాణలో చిన్న ఆందోళన కూడా లేకుండా జిల్లాల విభజన జరిగిందని.. అది కేసీఆర్ నాయకత్వం వల్లే సాధ్యమైందని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ వ్యాఖ్యానించారు. కొత్త జిల్లాలు ఏర్పడటం వల్ల అధికార వికేంద్రీకరణ జరిగిందన్నారు. జనసేన అంతర్జాతీయ పార్టీ అయినా తమకు సంబంధం లేదని.. పవన్ కల్యాణ్ ఏం చేసినా ఏపీ ప్రజలే చూసుకుంటారని తమకు అవసరం లేదన్నారు. భాజపా తెరాసపై ఛార్జ్ షీట్ దాఖలు చేయడం కాదని.... దమ్ముంటే అన్ని మున్సిపాల్టీల్లో అబ్యర్థులను నిలబెట్టాలని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ రామారావు పేర్కొన్నారు. భాజపాకు అభ్యర్థులే కరువయ్యారని... కాంగ్రెస్, భాజపాలు బీ ఫాంలు ఇస్తామన్నా తీసుకోవడానికి ముందుకు రావడం లేదన్నారు. కాంగ్రెస్, భాజపా లోపాయకారీ పొత్తులు పెట్టుకని.. బయటకు డ్రామాలు చేస్తున్నాయని కేటీఆర్ దుయ్యబట్టారు. తెరాస అభ్యర్థులకు భాజపా ప్రచారం చేస్తోందన్నారు. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం చేసిందేమీ లేదన్న కేటీఆర్.. తెలంగాణలో కట్టిన డబల్ బెడ్ రూం ఇళ్లు.. భాజపా పాలిత రాష్ట్రాల్లో కట్టారా చెప్పాలని కిషన్ రెడ్డికి సవాల్ చేస్తున్నానన్నారు. కిషన్ రెడ్డి కొల్లూరు వస్తే... ఎర్ర తివాచీ పరచి డబల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణాలు చూపిస్తానన్నారు. తమది ఉద్యోగులకు అనుకూల సర్కారని...నివేదిక వచ్చాక పీఆర్సీపై నిర్ణయం తీసుకుంటామన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికలకు ముందుగా వెళ్లాల్సిన అవసరం లేదని... ఆ ఎన్నికల్లోనూ తమదే విజయమని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీని విభజించాలన్నది తన వ్యక్తిగత అభిప్రాయమని.. ప్రభుత్వానికి సంబందం లేదన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు తెరాసకు ఓటేయాలని కోరిన కేటీఆర్.. కొత్త మున్సిపల్ చట్టాన్ని కఠినంగా అమలు చేస్తామన్నారు. రానున్న నాలుగేళ్లు పాలనపై పూర్తి దృష్టి సారిస్తామన్నారు. కేటీఆర్ తెలంగాణ భవన్ లో మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. end
Last Updated : Jan 17, 2020, 7:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.