ETV Bharat / city

తెలంగాణలో మిని పుర పోరు.. కారు జోరు..! - telangana varthalu

మినీ పురపోరులోనూ తెలంగాణ రాష్ట్ర సమితి మరోసారి సత్తా చాటింది. గతంలో మున్సిపాలిటీలన్నీ కైవసం చేసుకున్న తెరాస.. మినీ పోరులోనూ అదే దూకుడు కొనసాగించింది. వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లతో పాటు అచ్చంపేట, సిద్ధిపేట, కొత్తూరు, జడ్చర్ల, నకిరేకల్ లో సునాయసంగా గెలుపు బావుటా ఎగరవేసింది. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఫలితాలతో కొంత నిరుత్సాహ పడిన తెరాస శ్రేణుల్లో.. మళ్లీ వరస విజయాలు కొత్త ఊపునిచ్చాయి.

తెలంగాణ : మినిపోరులో తెరాస జయభేరి
తెలంగాణ : మినిపోరులో తెరాస జయభేరి
author img

By

Published : May 3, 2021, 11:00 PM IST

తెలంగాణలో ఎన్నిక ఏదైనా... విజయం తమదేనని చెప్పుకునే తెరాస.. మినీ పురపోరులోనూ సత్తా చాటింది. ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్లు, అచ్చంపేట, సిద్దిపేట, కొత్తూరు, జడ్చర్ల, నకిరేకల్ మున్సిపాలిటీలను సునాయసంగా కైవసం చేసుకుంది. పక్కా ప్రణాళికలతో తెరాస విజయదుందుభి మోగించింది. ముఖ్యంగా వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లపై కొంతకాలంగా ప్రత్యేక దృష్టి పెట్టిన తెరాస... అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసి ఆకర్షించే ప్రయత్నం చేసింది. తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ నిరంతరం స్థానిక నేతలతో సమాలోచనలు జరపుతూ సలహాలు ఇస్తూ.. ముందుకు నడిపారు. వ్యూహాలన్నీ ఫలించి విజయం చేకూరింది.

గులాబీల్లో రెట్టింపయిన ఉత్సాహం

మినీ పురపోరులో ఘన విజయంతో గులాబీ పార్టీలో ఉత్సాహం రెట్టింపయింది. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలతో కొంత నిరాశ చెందిన తెరాస శ్రేణుల్లో వరస విజయాలు కొత్త ఊపునిచ్చాయి. తెలంగాణ ఆవిర్భావం నుంచీ రాష్ట్రంలో ఎన్నిక ఏదైనా.. జోరు కారుదే అన్న చందంగా కొనసాగుతోంది. ఒక్క దుబ్బాక ఉపఎన్నిక .. జీహెచ్​ఎంసీలో కొంత హవా తగ్గినట్టు కనిపించినా మరోసారి మెరుపువేగంతో పుంజుకుంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నికల్లోనూ వరంగల్, నల్గొండ, ఖమ్మం స్థానాన్ని నిలబెట్టుకోడంతో పాటు.. హైదరాబాద్, రంగారెడ్డి మహబూబ్ నగర్​లోనూ పాగా వేసింది.

తాజాగా నాగార్జునసాగర్‌ ఉపఎన్నికలో అందరి అంచనాలను తలకిందులు చేస్తూ విజయం సాధించింది. 24 గంటల వ్యవధిలోనే వెలువడిన మినీ పురపోరు ఫలితాల్లోనూ అదే జోరు కొనసాగించింది. కొత్తూరు పురపాలిక మినహా ఎక్కడా కూడా విపక్షాలు ఎదురు నిలవలేకపోయాయి. అక్కడ కాంగ్రెస్‌ అభ్యర్థులు కొంతమేరకు పోటీ ఇవ్వగలిగారు. వరంగల్‌ కార్పొరేషన్‌లో భాజపా, ఖమ్మంలో కాంగ్రెస్‌ కొన్ని డివిజన్లను దక్కించుకోగలిగాయి.

జోరుగా ప్రచారం

నామినేషన్ల ప్రక్రియ నుంచి పోలింగ్‌ వరకు విపక్షాలను అధికారపక్షం వ్యూహాత్మకంగా డైలమాలో పడేసింది. అభ్యర్థుల ఎంపికతో పాటు ప్రచార వ్యూహాలతో చకచకా పావులు కదిపింది. ఉన్న కొద్ది సమయంలోనే మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రచారాన్ని వేడెక్కించారు. వీటికి తోటు కరోనా పరిస్థితుల్లో స్వతంత్రులు, పార్టీల ప్రచారానికి జనం నుంచి పెద్దగా స్పందన లభించలేదు. గతంలో ఆయా పుర, నగరపాలికలు తెరాస ఖాతాలోనే ఉండటం మరింత కలిసివచ్చింది. వీటికితోడు ప్రభుత్వం అండగా ఉంటేనే అభివృద్ధి సాధ్యమనే బలమైన సంకేతాలను జనంలోకి తీసుకెళ్లడంలో తెరాస మరోసారి విజయవంతమైంది. స్థానికంగా జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు మినీ పురపోరును సవాల్‌గా తీసుకొని గెలిపించారు.

బుజ్జగించడంలో సఫలం

అసంతృప్తులను బుజ్జగించడంలోనూ తెరాస సఫలమైంది. ఆశావహులు పెద్దఎత్తున నామపత్రాలు దాఖలు చేయగా వారిని బుజ్జగించడంలోనూ సఫలమైంది. వరంగల్‌, ఖమ్మం సహా పురపాలికలకు ఇచ్చిన హామీలు అన్నీ అమలు చేస్తామని మంత్రులు భరోసా కల్పించారు. కొవిడ్‌ పరిస్థితుల్లో మెరుపువేగంతో జరిగిన మినీ పురపోరులోనూ జోరు ప్రదర్శించిన తెరాస.. ఉపఎన్నికలు జరిగిన మున్సిపాలిటీల్లోనూ అధికార పక్షం పట్టునిలుపుకుంది.

ఇదీ చదవండి:

అసమర్థ పాలన వల్లే రాష్ట్రంలో ఆకలి చావులు : లోకేశ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.