ETV Bharat / city

yerrabelli : తెరాసకు ఎర్రబెల్లి గుడ్‌బై.. త్వరలో భాజపా గూటికి!

author img

By

Published : Aug 7, 2022, 3:21 PM IST

yerrabelli : తెలంగాణ రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సోదరుడు, వరంగల్‌ అర్బన్‌ కో-ఆపరేటివ్‌ బ్యాంకు అధ్యక్షుడు ఎర్రబెల్లి ప్రదీప్‌రావు తెరాసను వీడారు. ఆ పార్టీకి రాజీనామా చేసినట్లు ఆయన ప్రకటించారు. కొంతకాలంగా అసంతృప్తితో ఉన్న ప్రదీప్ రావు.. బీజేపీలో చేరుతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

yerrabelli
yerrabelli

Errabelli Pradeep Rao: రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సోదరుడు, వరంగల్‌ అర్బన్‌ కోఆపరేటివ్‌ బ్యాంకు అధ్యక్షుడు ఎర్రబెల్లి ప్రదీప్‌రావు తెరాసను వీడారు. ఆ పార్టీకి రాజీనామా చేసినట్లు ఆయన ప్రకటించారు. 2018 ఎన్నికల్లో వరంగల్‌ తూర్పు నుంచి ఎమ్మెల్యే టికెట్, తర్వాత ఎమ్మెల్సీ పదవి ఆశించి భంగపడిన ప్రదీప్‌రావు.. అప్పటి నుంచి పార్టీపై అసంతృప్తిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో తెరాసకు రాజీనామా చేసినట్లు ఆదివారం తెలిపారు. వరంగల్‌లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రదీప్‌రావు భాజపాలో చేరడం ఖాయమని.. కేంద్రమంత్రి అమిత్‌షా సమక్షంలో ఆ పార్టీలో ఆయన చేరనున్నట్లు తెలిసింది.

పార్టీలో చేరినప్పటి నుంచి ఎన్నో అవమానాలు పడ్డాను. అన్నీ సహించి ఇన్నాళ్లూ కొనసాగాను. నాకు ఎమ్మెల్యే టికెట్‌ ఇవ్వలేదు. మ కార్యకర్తలకు తెరాస ఏమీ చేయలేదు. బంగారు తెలంగాణ కోసం ఎన్నో త్యాగాలు చేశా. స్థానిక ఎమ్మెల్యే అవమానపరిచేలా మాట్లాడారు. పార్టీలో ఉండగానే ఎమ్మెల్యే మమ్మల్ని తిట్టారు. ఆయన తిట్టినా తెరాస నాయకులు ఎవరూ దాన్ని ఖండించలేదు. ఏ పార్టీ ఆదరిస్తే ఆ పార్టీకి వెళ్తా.. లేదంటే స్వతంత్రంగా ఉంటా’’- ఎర్రబెల్లి ప్రదీప్‌రావు, తెరాస నేత

ఇవీ చదవండి: ఆర్జీయూకేటీ విద్యార్థులు అసహనంతో ఉన్నారు: గవర్నర్ తమిళిసై

ఎద్దులు హల్​చల్.. ఘర్షణ పడి బైక్​ను ఢీ.. దూసుకొచ్చిన కారు..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.