Plane Crash at Nalgonda : తెలంగాణలోని నల్గొండ జిల్లా పెదవూర మండలం తుంగతుర్తి సమీపంలో సింగిల్ సీటర్ చాపర్ కూలింది. ఈ ఘటనలో ఓ మహిళా పైలట్ మృతి చెందారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
"మేము పొలం పనులు చేసుకుంటుండగా ఒక్కసారిగా పిడుగుపడినట్లు పెద్ద శబ్ధం వచ్చింది. ఏమైందోనని చూసేసరికి మా పొలాలకు సమీపంలో ఓ ప్రాంతం నుంచి దట్టమైన పొగలు, మంటలు రావడం కనిపించింది. ఎవరిదైనా పంట కాలిపోతుందేమోనని పరుగున అక్కడికి వెళ్లాం. చూసేసరికి ఓ విమానం దగ్ధమవుతోంది. అందులో నుంచి అరుపులు వినిపించాయి. ఏం చేయాలో అర్థమయ్యేలోగానే.. అరుపులు రావడం ఆగిపోయాయి. అప్పటికే అందులో ఉన్న వాళ్లు కాలిపోయి ఉంటారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించాం." - స్థానిక రైతులు
Nalgonda Plane Crash : రైతుల సమచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ప్రమాదం ఎలా జరిగిందోనని ఆరా తీస్తున్నారు. పొలాల్లోని విద్యుత్ టవర్ పక్కనే చాపర్ కూలినట్లు తెలిపారు. సాగర్‌లోని విజయపురి సౌత్ ఏవియేషన్ అకాడమీ చాపర్‌గా గుర్తించారు. ఈ ఘటనలో తమిళనాడుకు చెందిన మహిళా పైలట్ మహిమ మరణించినట్లు ఎస్పీ రెమా రాజేశ్వరి నిర్ధారించారు. ఘటనాస్థలిలో పోలీసు, రెవెన్యూ, వైద్య సిబ్బంది సహాయచర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు.
ఇదీ చదవండి
KCR Flexi: విజయవాడలో కేసీఆర్ భారీ ఫ్లెక్సీ.. ‘హ్యాట్సాఫ్ సీఎం సార్’ అంటూ..