ETV Bharat / city

బ్రహ్మంగారి మఠాధిపతి రెండో భార్య మహాలక్ష్మి పిటిషన్‌పై హైకోర్టులో విచారణ

బ్రహ్మంగారి మఠాధిపతి వివాదంపై హైకోర్టులో విచారణ జరిగింది. వీరబ్రహ్మేంద్రస్వామి మఠానికి.. పీఠాధిపతులుగా తమను గుర్తించేలా దేవాదాయ శాఖను ఆదేశించాలని కోరుతూ దివంగత మఠాధిపతి రెండో భార్య మారుతి మహాలక్ష్మి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. తదుపరి విచారణను ఈనెల 8కి వాయిదా పడింది.

bramham gari matham trail in high court
bramham gari matham trail in high court
author img

By

Published : Jul 5, 2021, 2:20 PM IST

బ్రహ్మంగారి మఠాధిపతి రెండో భార్య మహాలక్ష్మి పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. వీరబ్రహ్మేంద్రస్వామి మఠానికి.. పీఠాధిపతులుగా తమను గుర్తించేలా దేవాదాయ శాఖను ఆదేశించాలని కోరుతూ దివంగత మఠాధిపతి రెండో భార్య మారుతి మహాలక్ష్మి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. మఠాధిపతిగా.. ప్రత్యేక కమిషనర్‌ను నియమించే అధికారం ప్రభుత్వానికి లేదని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. మఠాధిపతిగా ప్రత్యేక కమిషనర్‌ను నియమించేందుకు.. ధార్మిక పరిషత్ తీర్మానించిందని ప్రభుత్వం తరఫు న్యాయవాది ధర్మాసనానికి తెలిపారు. ధార్మిక పరిషత్ తీర్మానం ప్రతిని హైకోర్టుకు సమర్పించారు. ధార్మిక పరిషత్ ఫైల్ చేసిన ప్రతుల కాపీలను పిటిషనర్‌కు అందజేయాలని ప్రభుత్వ న్యాయవాదిని ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 8కి వాయిదా వేసింది.

గత నెల 8న మఠం పీఠాధిపతి వీరభోగ వసంత వెంకటేశ్వరస్వామి శివైక్యం పొందగా.. అప్పటి నుంచి తదుపరి పీఠాధిపతి ఎవరన్న దానిపై వారసుల మధ్య వివాదం నడుస్తోంది. వెంకటేశ్వరస్వామి మొదటి భార్య కుమారులు, రెండోభార్య కుమారులు పీఠాధిపత్యం కోసం పట్టుబట్టారు. దీంతో తెలుగు రాష్ట్రాల మఠాధిపతులు, ప్రభుత్వ పెద్దలు చర్చలు జరిపినా సమస్య కొలిక్కి రాలేదు. దీంతో ప్రభుత్వం ఈ వ్యవహారం తేల్చేందుకు దేవదాయశాఖ జాయింట్ కమిషనర్ చంద్రశేఖర్ ఆజాద్‌ను నియమించింది. ఆయన మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డితో కలిసి ఇరు కుటుంబ సభ్యులను ఒప్పించారు. పీఠాధిపతిగా మొదటి భార్య పెద్దకుమారుడు వెంకటాద్రిస్వామి, ఉత్తరాధి పీఠాధిపతిగా రెండో కుమారుడు భద్రయ్యస్వామిని నియమించేలా కుటుంబ సభ్యుల మధ్య ఒప్పందం కుదిరింది. వీరి తదనంతరం.. రెండో భార్య కుమారుడు గోవిందస్వామికి పీఠాధిపతి అవకాశం దక్కనుంది. ఈ మేరకు రాతపూర్వక హామీ ఇచ్చారు.

తమను బలవంతంగా ఒప్పించారని దివంగత మఠాధిపతి రెండో భార్య మారుతి మహాలక్ష్మి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. పీఠాధిపతులుగా తమను గుర్తించేలా దేవాదాయ శాఖను ఆదేశించాలని కోరారు.

ఇదీ చదవండి:

బ్రహ్మంగారి మఠం: పీఠాధిపతి వ్యాజ్యం విచారణ సోమవారానికి వాయిదా

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.