కరోనా వ్యాప్తిని తగ్గించడానికి ప్రభుత్వం లాక్డౌన్ విధించి ప్రజలెవ్వరూ రోడ్డు మీదకు రాకుండా నిరోధించాలని చూసింది. అయితే.. ప్రజలు మాత్రం.. ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తూ రోడ్ల మీద తిరుగుతున్నారు. లాక్డౌన్ సమయంలో కూడా రోడ్ల మీద యధేచ్చగా తిరుగుతున్న జనాలను అదుపు చేసేందుకు లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై తెలంగాణ పోలీసులు సాంకేతికత సాయంతో చలానాలు విధిస్తున్నారు. కొన్నిచోట్ల వాహనాలను సీజ్ చేస్తున్నారు. లాక్డౌన్ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు నిబంధనలు అతిక్రమించిన వేలాది వాహనదారులపై కేసులు నమోదయ్యాయి. కొన్ని వాహనాలను సీజ్ చేశారు.
చెక్‌పోస్టులు పెట్టి..
లాక్డౌన్ సందర్భంగా హైదరాబాద్‌లో పలు చోట్ల చెక్ పోస్టులు ఏర్పాటు చేసి నిబంధనలు అతిక్రమించి రోడ్లపైకి వస్తున్న వారికి చలానాలు విధించారు. గత రెండు రోజులుగా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో వేలల్లో కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా నిబంధనలు అతిక్రమించిన వారిపై సాంకేతికత సాయంతో కేసులు నమోదు చేస్తున్నారు. ప్రధాన కూడళ్ళు, సిగ్నళ్ళ వద్ద విధించే చలాన్లు మాత్రమే కాకుండా ఇంటి నుంచి మూడు కిలోమీటర్ల పరిధి దాటితే అటోమేటికి నంబర్ ప్లేట్ రికగ్నైజేషన్(ఎఎన్పీఆర్) సాంకేతికతతో కేసులు నమోదు చేస్తున్నారు. కరోనా వైరస్ ప్రభావం ఉన్నందున అవసరం లేకున్నా ఏదో ఒక కారణంతో రోడ్లపైకి రావద్దని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. ఆర్టీఏ అధికారులతో సమన్వయం చేసుకుని నంబర్ ప్లేట్ అడ్రస్ ఆధారంగా వాహనదారుడు ఇంటి నుంచి మూడు కిలోమీటర్లు దాటితే ఆటోమేటిక్‌గా చలాన్లు విధిస్తున్నారు.
ఇదీ చూడండి:- రాష్ట్రంలో 40 కరోనా పాజిటివ్ కేసులు