ETV Bharat / city

అల్లు అర్జున్‌, కల్యాణ్‌రామ్ కార్లకు జరిమానా..అదే కారణం..

author img

By

Published : Mar 27, 2022, 12:20 PM IST

Traffic Challan to Allu arjun and Kalyan Ram: కార్లకు బ్లాక్ ఫిల్మ్ ఉంటే తొలగింపు పని వేగవంతం చేశారు తెలంగాణ ట్రాఫిక్ పోలీసులు. వీఐపీలు, ప్రముఖుల కార్లను కూడా వదిలిపెట్టడం లేదు. హైదరాబాద్ లో నేడు జరిపిన వాహన తనిఖీల్లో సినీనటులు అల్లు అర్జున్‌, కల్యాణ్‌రామ్‌ల కార్లకున్న నల్లతెరలను తొలగించారు. నిబంధనలు అతిక్రమించినందుకు జరిమానాలు విధించారు.

raffic-challans-on-allu-arjun-and-kalyan-ram-cars
raffic-challans-on-allu-arjun-and-kalyan-ram-cars
అల్లు అర్జున్‌, కల్యాణ్‌రామ్ కార్లకు జరిమానా..అదే కారణం..

Traffic Challan to Allu arjun and Kalyan Ram: తెలంగాణలో ఇటీవల జూబ్లీహిల్స్​లో జరిగిన కారు ప్రమాదం అనంతరం ఆ రాష్ట్ర ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తమయ్యారు. రెండు వారాలుగా ప్రత్యేక తనిఖీలు చేస్తున్నారు. అద్దాలకు బ్లాక్‌ ఫిల్మ్‌ ఉన్న కార్లతో పాటు ప్రజాప్రతినిధుల స్టిక్కర్లున్న వ్యక్తిగత వాహనాలు గుర్తించి తొలిగిస్తున్నారు. సరైన నంబర్ ప్లేట్లు​లేని వాహనాలను వావాహాలను గుర్తించి.. చర్యలు తీసుకుంటున్నారు. జరిమానాలు విధిస్తున్నారు.

జూబ్లీహిల్స్‌ ట్రాఫిక్‌ ఎస్సై శ్రీధర్‌ శనివారం రోడ్‌ నంబరు 36లోని నీరూస్‌ కూడలిలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. హీరోలు.. అల్లుఅర్జున్‌, కల్యాణ్‌రామ్‌ తమ కార్లలో అటుగా వెళ్తుండగా పోలీసులు ఆపారు. వారి కార్ల అద్దాలకు ఉన్న నలుపు తెరలను తొలగించారు. నిబంధనలకు విరుద్ధంగా నల్లతెరలు ఉన్నందుకు గానూ.. రూ.700 చొప్పున చలాన్లు విధించారు. నల్లతెరలను తొలగించే సమయంలో వారు కారులోనే ఉన్నట్టు సమాచారం.

నలుపు తెరతోపాటు ఇతర నిబంధనలు పాటించని 80కిపైగా వాహనాలపై కేసులు నమోదు చేశారు. రెండు వారాలుగా జరుగుతున్న ప్రత్యేక డ్రైవ్​లో ఇప్పటి వరకు నగరవ్యాప్తంగా 15వేలకు పైగా కేసులు నమోదైనట్టు పోలీసులు పేర్కొన్నారు.

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.