ETV Bharat / city

Revanth Reddy House Arrest: 'పార్లమెంట్ సమావేశాలకు వెళ్లకుండా అడ్డుకుంటున్నారు'

author img

By

Published : Jul 19, 2021, 10:43 AM IST

హైదరాబాద్​ కోకాపేట భూముల వేలంలో అక్రమాలు జరిగాయని తెలంగాణ కాంగ్రెస్ ఆరోపించింది. ఈ నేపథ్యంలో ఆ భూములను సందర్శించాలని నిర్ణయించింది. ఈ రోజు కోకాపేట వెళ్లనున్నట్లు ఆ పార్టీ నేతలు తెలిపారు. ముందస్తుగా అప్రమత్తమైన పోలీసులు.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని గృహనిర్బంధం చేశారు.

TPCC president house arrested
TPCC president house arrested
TPCC president house arrested
రేవంత్ రెడ్డి ఇంటివద్ద పోలీసు బలగాలు

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని ఆ రాష్ట్ర పోలీసులు గృహ నిర్బంధం చేశారు. తెలంగాణ కోకాపేటలో ప్రభుత్వం వేలం వేసిన భూముల సందర్శన, ధర్నాకు కాంగ్రెస్‌ పిలుపునిచ్చిన నేపథ్యంలో జూబ్లీహిల్స్‌లోని రేవంత్‌రెడ్డి నివాసం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. పార్లమెంటు సమావేశాలకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకుంటున్నారని రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. కోకాపేట భూముల వేలంలో అవినీతి జరిగిందని ఇటీవల ఆరోపణలు చేశారు. కేంద్ర హోంశాఖకు ఆధారాలతో ఫిర్యాదు చేస్తానని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే పార్లమెంటు సమావేశాలకు వెళ్లకుండా అడ్డుకుంటున్నారని రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

కోకాపేట భూముల వద్దకు తెలంగాణ మాజీ ఉపముఖ్యమంత్రి, పీసీసీ ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్‌ దామోదర రాజనర్సింహ, పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు, జగ్గారెడ్డి, మహేశ్‌కుమార్‌ గౌడ్‌, రంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షుడు నరసింహారెడ్డి తదితరులు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఇటీవల జరిగిన కోకాపేట భూముల వేలంలో అవినీతి జరిగిందని కాంగ్రెస్‌ పార్టీ ఆరోపిస్తోంది. దీనిలో భాగంగానే ఆ భూముల సందర్శనకు పిలుపునిచ్చింది.

రేవంత్‌ హౌస్ అరెస్టును తెలంగాణ మాజీ మంత్రి షబ్బీర్ అలీ, వేం నరేందర్‌రెడ్డి ఖండించారు. పార్లమెంటుకు వెళ్లకుండా అడ్డుకోవడం తగదన్నారు. ప్రభుత్వ నియంతృత్వానికి ఇది పరాకాష్ఠ అని పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి విమర్శించారు. భూముల వేలంలో అవినీతిని ఎండగడతారనే అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు. భయంతోనే ప్రభుత్వం కాంగ్రెస్ నేతలను అడ్డుకుంటుందన్నారు. ఇది అప్రజాస్వామికమని.. ఇంత దుర్మార్గం ఎక్కడా చూడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నియంత, అవినీతి పాలకులకు ప్రజలే బుద్ధి చెబుతారని మల్లు రవి స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:

jagan polavaram tour: పోలవరం పర్యటనకు బయల్దేరిన సీఎం జగన్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.