ETV Bharat / city

పొతిరెడ్డిపాడుపై ఆనాడే పీజేఆర్ గొంతెత్తారు: రేవంత్ రెడ్డి

పోతిరెడ్డిపాడు మీద మొదట పోరాటం చేసింది... అది కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే కొట్లాడింది... పి.జనార్దన్‌ రెడ్డి అని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి వెల్లడించారు. పోతిరెడ్డిపాడు తెలంగాణ పట్ల మరణశాసనమని ఆనాడే పీజేఆర్‌ హెచ్చరించారన్నారు. పీజేఆర్​ చనిపోయిన తరువాత తెలంగాణ తరఫున బలంగా పోరాడే నేత లేకుండా పోయారని ఆందోళన వ్యక్తం చేశారు.

tpcc chief revanth reddy
tpcc chief revanth reddy
author img

By

Published : Jul 4, 2021, 10:14 PM IST

రేవంత్ రెడ్డి

తెలంగాణ ప్రజల హక్కులను కాపాడేందుకు శాయాశక్తులా పోరాడిన మహనీయుడు పీజేఆర్​ అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి కొనియాడారు. ఖైరతాబాద్​ మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్​రెడ్డిని దోమలగూడలోని ఆయన నివాసంలో రేవంత్​రెడ్డి కలిశారు. టీపీసీసీ అధ్యక్షుడు అయ్యాక మొదటిసారి విష్ణు​ను కలిసేందుకు వచ్చిన రేవంత్​కు కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు.

పీజేఆర్​ ఆనాడే చెప్పారు..

ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జరుగుతున్న కృష్ణజలాల విషయంలో వివాదం చెలరేగుతుందని పీజేఆర్... ఆనాడే హెచ్చరించారని గుర్తు రేవంత్ రెడ్డి చేశారు. పోతిరెడ్డిపాడు వల్ల తెలంగాణ ప్రజలు నష్టపోతారని.. ఆనాటి సీఎం రాజశేఖర్​రెడ్డితో కొట్లాడారని తెలిపారు. పోతిరెడ్డిపాడు తెలంగాణ పట్ల మరణశాసనమని ఆనాడే హెచ్చరించారన్నారు. కాంగ్రెస్​ అధికారంలో ఉన్నా... కృష్ణా నదీ జలాలు తెలంగాణ ప్రజల జన్మహక్కు అని పోరాడిన వ్యక్తి పీజేఆర్​ అని తెలిపారు. కృష్ణా జలాలపై తెలంగాణ హక్కులను కాపాడేందుకు దిల్లీ వరకు వెళ్లి.. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీతో మాట్లాడారన్నారు. కృష్ణా జలాల విషయంలో కొట్లాడినందునే...వైఎస్సార్ ఆనాడు పి.జనార్దన్‌ రెడ్డిని కేబినెట్‌లోకి తీసుకోలేదని ఆరోపించారు. సీఎల్పీ నేతగా అప్పటి ప్రభుత్వాలను గడగడలాడించిన వ్యక్తి పీజేఆర్‌ అని కొనియాడారు.

నగర ప్రజల గొంతు తడిపారు...

ప్రస్తుతం హైదరాబాద్​లో తాగునీటి ఇబ్బంది లేదంటే.. దానికి ఏకైక కారణం పీజేఆర్​ అని రేవంత్​ పేర్కొన్నారు. తాగునీటి కష్టాలు పారద్రోలడానికి... కృష్ణాజలలాను సాగర్​ నుంచి తెచ్చి భాగ్యనగర ప్రజల గొంతు తడిపిన కృషీవలుడు పీజేఆర్​ అని తెలిపారు. వేసవి వచ్చిందంటే చాలు పదిరోజులకోసారి మంచినీళ్లు రావటం... నీళ్ల ట్యాంకర్ల దగ్గర బిందెలతో కొట్లాటలు.. ఇవన్నీ చూసి చలించిపోయారని గుర్తుచేసుకున్నారు. కృష్ణా జలాలను హైదరాబాద్‌ తాగునీటి కోసం తరలించాలని ఆయన పోరాటం వల్లే నీటి సమస్య పరిష్కారమైందని రేవంత్ రెడ్డి చెప్పారు. ఇప్పటికీ నగరంలోని బస్తీ ప్రజలు పీజేఆర్​ను దేవునిలా కొలుస్తున్నారంటే.. ఆయన సేవలు ఎంత గొప్పవో అర్థం చేసుకోవచ్చని స్పష్టం చేశారు. పీజేఆర్​ సేవలను అందరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరముందన్నారు.

"పీజేఆర్​ అకాల మరణం తర్వాత... తెలంగాణ ప్రజల తరఫున బలంగా పోరాడే నేత కాంగ్రెస్​లో ఎవరూ లేకుండా పోయారు. పార్టీకి ఎంతో సేవ చేసిన పీజేఆర్​ ఆకాంక్షలను నెరవేర్చేందుకు కృషి చేస్తాం. జనార్దన్​రెడ్డి కుటుంబసభ్యులకు పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుంది. పీజేఆర్​ రాజకీయ వారసునిగా వచ్చి... ప్రజల మన్ననలు పొందుతున్న విష్ణువర్దన్​రెడ్డికి పార్టీలో సముచిత స్థానం కల్పించేందుకు అధిష్ఠానంతో మాట్లాడతా. పార్టీలకతీతంగా విష్ణువర్దన్​రెడ్డితో నాకు అనుబంధం ఉంది. సోదరునిగా నా సాయమెప్పుడూ విష్ణుకు ఉంటుంది. పీజేఆర్​ స్ఫూర్తితో పేద ప్రజలకు అండగా ఉండి.. పేదోడి గొంతుగా... పనిచేస్తాం."

- రేవంత్​రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు

ఏ రాజ్యాంగంలో ఉంది..

కొందరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ పార్టీని వీడి తెరాసలో చేరి సీఎల్పీని విలీనం చేశారు... అలా చేయాలని ఏ రాజ్యాంగంలో ఉందో చెప్పాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి నిలదీశారు. ఈ నెల 7వ తేదీ తర్వాత తనను విమర్శించిన వాళ్ల పని పడతానని రేవంత్​ అన్నారు. విష్ణు వర్ధన్​తో భేటీ అనంతరం.. రేవంత్​ జూబ్లీహిల్స్​లో ఉంటున్న పార్టీ జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ నివాసానికి వెళ్లి కలిశారు. ఖైరతాబాద్​ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీకి దాసోజు శ్రవణ్‌, పీసీసీ వర్కింగ్‌ ప్రసిడెంట్‌ అంజన్‌కుమార్‌ యాదవ్‌, అనిల్ కుమార్‌ యాదవ్‌, రోహన్ రెడ్డి... ఇలా చాలా మంది ఉన్నారని... వారంతా కలిసి పార్టీని బలోపేతం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రత్యేక రాష్ట్రం వచ్చాక కేసీఆర్ పాలనలో తెలంగాణ ద్రోహులను అందలం ఎక్కించారని ఆరోపించారు. ఆదిలాబాద్‌ నుంచి అలంపూర్ వరకు తెలంగాణ కోసం పనిచేసిన ఉద్యమకారులకు గుర్తింపు లేదని విమర్శించారు. తెలంగాణ కోసం పోరాటం చేసిన రైతులు, విద్యార్థులు, యువత అంత నిర్లక్ష్యానికి గురవుతున్నారని ధ్వజమెత్తారు. రేవంత్​రెడ్డిని కేంద్ర మాజీ మంత్రి జేడీ శీలం మర్యాదపూర్వకంగా కలిశారు. టీపీసీసీగా నియమితులైనందుకు గానూ... శుభాకాంక్షలు తెలిపారు.

ఇదీ చూడండి:

Kishan Reddy: కృష్ణా జలాలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.