ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 7PM - ap top ten news

.

top news
top news
author img

By

Published : Jun 23, 2020, 6:59 PM IST

  • రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పాటు కానున్నాయా?
    సచివాలయంలో స్పందన కార్యక్రమంపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో ముఖ్యమంత్రి జగన్ సమీక్ష నిర్వహించారు. అయితే.. బోధనాసుపత్రుల నిర్మాణానికి సంబంధించి జరిగిన చర్చలో భాగంగా ముఖ్యమంత్రి జగన్ కొత్త జిల్లాల ఏర్పాటు ఆలోచనను మరోమారు ప్రస్తావించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
  • శాసన మండలి ఛైర్మన్​​కు వైకాపా లేఖ
    శాసన మండలి ఛైర్మన్ షరీఫ్‌కు అధికార వైకాపా లేఖ రాసింది. మండలిలో జరిగిన పరిణామాలను ఎథిక్స్​ కమిటీకి ఇవ్వాలని లేఖలో కోరింది. ఇటీవల మండలిలో పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులపై అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం సాగింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
  • వైకాపా ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్
    రాష్ట్రంపై కరోనా పంజా విసురుతోంది. ప్రాంతాలకు అతీతంగా విస్తరిస్తోంది. ఇప్పటివరకు ప్రజాప్రతినిధుల వ్యక్తిగత, కార్యాలయ, భద్రతా సిబ్బంది మాత్రమే కరోనా బారిన పడ్డారు. కానీ తాజాగా రాష్ట్రంలో తొలిసారి ఓ ఎమ్మెల్యేకు కరోనా నిర్ధరణ అయ్యింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
  • ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకుంటాం
    నిబంధనలకు విరుద్ధంగా వార్షికోత్సవాల పేరుతో ప్రైవేటు విద్యాసంస్థలు డబ్బులు వసూలు చేస్తున్నారంటూ దాఖలైన వ్యాజ్యంపై హైకోర్టు విచారణ చేపట్టింది. నిబంధనలు పాటించని ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకుంటామని తెలిపింది. ఆ పాఠశాలల వివరాలు కోర్టుకు అందజేయాలని పిటిషనర్​ను ఆదేశించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
  • పెళ్లింట వరుడు సహా 14 మందికి కరోనా
    రాజస్థాన్​ భీల్​వాడాలో కరోనా కలకలం రేపింది. భడదా భాగ్​లో పెళ్లయిన వారానికే వరుడు సహా.. అతడి కుటుంబంలోని మరో 13 మందికి కరోనా పాజిటివ్​గా తేలింది. పెళ్లింట్లో ఒకేసారి ఇంతమందికి వైరస్​ సోకడం స్థానికుల్లో భయాందోళనలు కలిగిస్తోంది. వివాహ వేడుకలో భౌతిక దూరం నిబంధనలు సరిగా పాటించకపోవడమే కారణంగా తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
  • చైనా మంత్రి ఎదుటే డ్రాగన్​పై జైశంకర్​ పంచ్​!
    అంతర్జాతీయ సంబంధాలను గౌరవించి, భాగస్వాముల ప్రయోజనాలను గౌరవించాలని భారత విదేశాంగ మంత్రి జైశంకర్​ వ్యాఖ్యానించారు. భారత్, రష్యా, చైనా త్రైపాక్షిక భేటీలో.. చైనాను ఉద్దేశించి పరోక్షంగా ఈ వ్యాఖ్యలు చేశారు. అంతర్జాతీయ వ్యవహారాల్లోనూ సమకాలీక వాస్తవికతకు అనుగుణంగా సంస్కరణలు జరగాలని సూచించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
  • చివరి గంటలో కొనుగోళ్ల జోరు
    చివరి గంటలో వెల్లువెత్తిన కొనుగోళ్ల మద్దతుతో స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్​ 519 పాయింట్లు బలపడింది. నిప్టీ 160 పాయింట్లు పుంజుకుంది. అయితే ఇటీవల వరుస లాభాలతో దూసుకుపోయిన రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు ఈ సెషన్​లో డీలా పడ్డాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
  • టెస్టు ఫార్మాట్​ ఎలా ఆడాలో నేర్పిస్తుంది
    టెస్టు క్రికెట్​ ద్వారా ఆటగాడిలో ఉన్న ఉత్తమ ప్రదర్శన బయట పడుతుందని అభిప్రాయపడ్డాడు వెస్టిండీస్​ బ్యాట్స్​మన్​ క్రిస్​ గేల్​. ఈ ఫార్మాట్​లో ప్రదర్శన ద్వారా భవిష్యత్​లో అవకాశాలు వస్తాయని వెల్లడించాడు. యువ క్రికెటర్లు టెస్టు క్రికెట్​పై దృష్టి సారించాలని సూచించాడు​. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
  • సుశాంత్​ సూసైడ్​: మరో నలుగురిపై కేసు
    బాలీవుడ్​ హీరో సుశాంత్​ సింగ్ రాజ్​పుత్ ఆత్మహత్యపై అనుమానాలు వ్యక్తం చేస్తూ.. మరో నలుగురు సినీ ప్రముఖులపై న్యాయవాది సుధీర్​ ఓజా కేసు నమోదు చేశారు. ఇప్పటివరకు సల్మాన్​ఖాన్​, సంజయ్ లీలా భన్సాలీ, కరణ్ జోహర్​ సహా మొత్తం ఎనిమిది మందిపై కేసు పెట్టారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
  • 'బ్యాట్‌మన్‌ ఫరెవర్' దర్శకుడు షూమేకర్ కన్నుమూత
    ప్రముఖ హాలీవుడ్‌ దర్శకుడు జోయెల్‌ షూమేకర్‌ కన్నుమూశారు. కొంతకాలంగా కేన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఆయన జూన్‌ 22న న్యూయార్కులో తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 80 సంవత్సరాలు. కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా 'స్లీపర్', 'ఇంటీరియర్స్' సహా అనేక సినిమాలకు పని చేశారు. షూమేకర్‌ కొన్ని చిత్రాలకు రచయితగాను బాధ్యతలు నిర్వర్తించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.