ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 9PM - breaking news

.

ప్రధాన వార్తలు @ 9PM
ప్రధాన వార్తలు @ 9PM
author img

By

Published : Feb 27, 2022, 8:58 PM IST

  • రష్యాతో చర్చలకు ఉక్రెయిన్​ అంగీకారం- వేదిక అదే..
    యుద్ధానికి ముగింపు పలికి శాంతి స్థాపన కోసం చర్చలకు రావాలంటూ రష్యా చేసిన ప్రతిపాదనకు ఉక్రెయిన్‌ అంగీకరించింది. చర్చలకు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వోలోదిమిర్‌ జెలెన్‌స్కీ అంగీకరించినట్లు రష్యా మీడియా వెల్లడించింది. బెలారస్‌ వేదికగా ఈ చర్చలు జరగనున్నాయి. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • Milan-2022: సాగర రక్షణలో మరో అధ్యాయం మొదలైంది: సీఎం జగన్
    నౌకాదళంలో 'ఐఎన్‌ఎస్‌ విశాఖ', 'ఐఎన్‌ఎస్‌ వేల' చేరికతో సాగర రక్షణలో మరో అధ్యాయం మొదలైందని సీఎం జగన్ అన్నారు. విశాఖ తీరంలో జరుగుతున్న మిలాన్ వేడుకలకు హాజరైన ముఖ్యమంత్రి.. నౌకల విన్యాసాలు విశాఖ ప్రజలకు ఉత్సాహాన్నిస్తాయన్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • కక్ష సాధింపులు బాక్సాఫీస్‌ వద్ద ఎందుకు..? ఏపీ ప్రభుత్వ తీరుపై ప్రకాశ్‌రాజ్‌ ట్వీట్‌
    సినీ రంగంపై ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై నటుడు ప్రకాశ్‌రాజ్‌ ఘాటుగా స్పందించారు. సృజన.. సాంకేతికత మేళవించిన రంగం సినిమా అన్నారు. సినీరంగంపై అధికార దుర్వినియోగం, ఆధిపత్య ధోరణి ఏంటి? అని ప్రశ్నించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • నాపై నిఘా పెట్టారు.. అరెస్ట్ చేసేందుకు పోలీసులను ఉంచారు - ఎంపీ రఘురామ
    వైకాపా ప్రభుత్వంపై నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు విమర్శలు గుప్పించారు. అధికార బలంతో ప్రతివారినీ దెబ్బతీసేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. మరోసారి తనను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని వ్యాఖ్యానించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • ఏడేళ్లు గడిచినా రాజధాని ఎక్కడో తెలియదు..ఇది మన లోపం కాదా ? -ఆర్ఎస్ఎస్ రాం మాధవ్
    దేశంలో మంచి వ్యవస్థల్ని నెలకొల్పినప్పుడే ప్రజలకు ఎక్కడకు వెళ్లినా గౌరవం లభిస్తుందన్నారు ఆర్ఎస్ఎస్ నాయకులు రాం మాధవ్. రాష్ట్ర విభజన జరిగి ఏడేళ్లు గడిచినా ఇంకా రాజధాని ఎక్కడో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. ఇది మన రాజకీయ వ్యవస్థలోని లోపం కాదా అని ప్రశ్నించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • కాంగ్రెస్​కు భారీ షాక్​- భాజపాలోకి ఆజాద్​ సోదరుడి కుమారుడు
    జమ్ముకశ్మీర్​లో కాంగ్రెస్​కు భారీ షాక్​ తగిలింది. కాంగ్రెస్​ కీలక నేత గులాం నబీ ఆజాద్​ సోదరుడి కుమారుడు భాజపాలో చేరారు. కొంతకాలంగా కాంగ్రెస్​ సీనియర్​ నేతలు పార్టీని వీడుతున్న క్రమంలో ఇది ప్రాధాన్యం సంతరించుకుంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • యూపీ ఐదో దశ ఎన్నికలు ప్రశాంతం- 54% ఓటింగ్​!
    ఉత్తర్ ప్రదేశ్ శాసనసభ ఎన్నికల ఐదో విడత పోలింగ్ స్వల్ప ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. 12 జిల్లాల పరిధిలోని 61 అసెంబ్లీ స్థానాలకు ఓటింగ్ జరగగా.. మొత్తం 692 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. సాయంత్రం 5 గంటల వరకు 53.98 శాతం పోలింగ్ నమోదైంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • 'దేశభక్తికి.. కుటుంబ భక్తికి చాలా తేడా ఉంది'
    భారత్​ ఆయుధ సంపత్తిలో ఇతర దేశాలపై ఆధారపడేలా గత ప్రభుత్వాలు వ్యవహరించాయని ప్రధాని మోదీ ఆరోపించారు. దేశ భక్తికి.. కుటుంబ భక్తికి చాలా తేడా ఉంటుందని ప్రతిపక్షాలనుద్దేశించి విమర్శించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • 24 ఏళ్ల తర్వాత పాక్ గడ్డపై అడుగుపెట్టిన ఆసీస్
    ఆస్ట్రేలియా క్రికెట్​ జట్టు సుదీర్ఘ కాలం తర్వాత పాకిస్థాన్​లో అడుగుపెట్టింది. పాక్​ గడ్డపై చివరగా 1998లో ఆడింది. ప్రస్తుతం మూడు టెస్టులు, మూడు వన్డేలు సహా ఓ టీ20లో తలపడనుంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • అలరిస్తున్న 'ఆడవాళ్లు మీకు జోహార్లు' ట్రైలర్‌.. హిందీలో రామ్​-నితిన్​ హవా!
    శర్వానంద్​-రష్మిక జంటగా నటించిన ఆడవాళ్లు మీకు జోహార్లు ట్రైలర్​ను చిత్రబృందం ఆదివారం విడుదల చేసింది. టైటిల్‌కు తగ్గట్టే మహిళలకు ప్రాధాన్యమున్న కథతో ఈ సినిమాను రూపొందించినట్టు తెలుస్తోంది. మరోవైపు టాలీవుడ్‌ హీరోలు రామ్‌ పోతినేని, నితిన్‌ ఇక్కడివారినే కాదు బాలీవుడ్‌ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.