- Southern Zonal Council: అజెండాలో ఈ అంశాలు ఉంచండి : సీఎం
తిరుపతిలో జరగనున్న సదరన్ కౌన్సిల్ (Southern Zonal Council) సమావేశంలో.. విభజన చట్టంలోని అపరిష్కృత అంశాలను ప్రస్తావించాలని సీఎం జగన్ నిర్ణయించారు. వీటికి సంబంధించి పూర్తి వివరాలతో అధికారులు సిద్ధంకావాలని నిర్దేశించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- గోదావరి బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం మరో లేఖ.. ఏం చెప్పిందంటే?
గోదావరి బోర్డుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో లేఖ రాసింది. జీఆర్ఎంబీ ఛైర్మన్‌కు ఈఎన్సీ మురళీధర్ లేఖ రాశారు. ప్రాజెక్టుల డీపీఆర్‌లు విభజన చట్టం ప్రకారమే సీడబ్ల్యూసీకి పంపాలని లేఖలో పేర్కొన్నారు. చౌటుపల్లి హన్మంతరెడ్డి లిఫ్ట్, ముక్తేశ్వర లిఫ్ట్, తుపాకుల గూడెం, మోడికుంట వాగు, సీతారామ లిఫ్ట్ కొత్తవి కావని స్పష్టం చేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- పన్నులు, జీఎస్టీ వసూళ్ల లక్ష్యం.. 31వేల కోట్లు: రాష్ట్ర పన్నుల చీఫ్ కమిషనర్
ఈ ఆర్థిక సంవత్సరంలో.. పన్నులు, జీఎస్టీ వసూళ్ల ద్వారా రూ.31 వేల కోట్ల వసూళ్లను లక్ష్యంగా నిర్ణయించుకున్నట్టు రాష్ట్ర పన్నుల ప్రధాన కమిషనర్ రవిశంకర్ నారాయణ్ స్పష్టం చేశారు. పన్ను వసూళ్లు సాధించేందుకు పటిష్టమైన రిటర్నుల దాఖలు వ్యవస్థను అమలు చేస్తున్నట్టు చెప్పారు. ఈ లక్ష్యంలో ఇప్పటి వరకు రూ.18 వేల కోట్ల వరకూ వసూలు చేశామని చెబుతున్న రవిశంకర్ తో "ఈటీవీ భారత్" ముఖాముఖి. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- దీపావళి పండుగ.. అందరి జీవితాల్లో కాంతులు నింపాలి: సీఎం జగన్
తెలుగు ప్రజలందరికీ సీఎం జగన్(CM Jagan) దీపావళి(diwali wishes) శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండగ అందరి జీవితాల్లో కాంతులు నింపాలని ఆకాంక్షించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- విద్య.. వినియోగదారుల రక్షణ చట్టం పరిధిలోకి వస్తుందా?
వినియోగదారుల రక్షణ చట్టంలో భాగంగా 'విద్య' అనే అంశాన్ని సేవగా పరిగణించాలా? లేదా? అనే అంశంపై దాఖలైన పిటిషన్ విచారణకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఈ తరహా అంశంపై తీర్పు పెండింగ్‌లో ఉన్న మరో కేసుకు దీనిని జత చేస్తూ విచారణకు స్వీకరించింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- మూఢనమ్మకాలకు 11 ఏళ్ల బాలిక బలి- తండ్రి, మత గురువు అరెస్ట్
మూఢనమ్మకాలతో 11 ఏళ్ల కుమార్తె ప్రాణాలు పోయేందుకు కారణమయ్యాడో తండ్రి. ప్రార్థనలు, క్షుద్రపూజలతో(black magic in kerala) రోగం నయమవుతుందని నమ్మాడు. బాలిక మృతికి కారణమైన తండ్రి, మత గురువును పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటన కేరళ, కన్నూర్‌లో జరిగింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- దీపావళికి ఈ లడ్డూలే హైలైట్- కిలో రూ.30వేలు!
దీపావళి పండగ వేళ మిఠాయిలకు ఉన్న డిమాండ్, క్రేజ్ అంతాఇంతా కాదు. దీంతో మిఠాయి దుకాణాదారులు కస్టమర్లను ఆకట్టుకునేందుకు వివిధ రకాల స్వీట్లను తయారు చేస్తున్నారు. వాటికంటూ ప్రత్యేక ధర నిర్ణయించి అమ్ముతున్నారు. ఉత్తర్‌ప్రదేశ్ ఆగ్రాలోని ఓ మిఠాయి దుకాణం కిలో స్వీట్లను ఏకంగా రూ. 30వేలకు విక్రయిస్తోంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- చేజేతులారా ఆహార సంక్షోభంలోకి జారుకున్న చైనా!
'సరకులు కొనుగోలు చేసి నిల్వ చేసుకోండి. పొట్టుతీయని ధాన్యాలు తినండి. పండ్లు, కాయగూరలను ఆరబెట్టి నిల్వచేసుకోండి' లాంటి ప్రకటనలు ప్రభుత్వాల నుంచి వెలువడితే.. ఎలాంటి పరిస్థితులు ఎదురుకానున్నాయో ఊహించుకోవచ్చు! ఆర్థిక శక్తిలో అమెరికాకు సవాలు విసురుతున్న చైనా పాలకులు (china food shortage) ఈ మధ్య ఇలాంటి ప్రకటనలనే ఇస్తున్నారట!. ఇంతకీ.. చైనా పాలకులకు ఆ గత్యంతరం ఎందుకు పట్టిందంటే.. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- టీమ్ఇండియా సెలెక్టర్లు.. ఆ విషయంపై దృష్టిపెట్టాలి: కపిల్‌దేవ్
టీ20 ప్రపంచకప్‌లో(T20 World Cup 20) టీమ్ఇండియా పేలవ ప్రదర్శన నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు చేశాడు దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్(Kapil Dev News). బీసీసీఐ.. యువ ఆటగాళ్లకు అవకాశమిచ్చే అంశంపై ఆలోచించాలని అభిప్రాయపడ్డాడు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- సంక్రాంతి రేస్ నుంచి 'సర్కారు వారి పాట' ఔట్
మహేశ్ 'సర్కారు వారి పాట'(sarkaru vaari paata release date) చిత్రానికి కొత్త రిలీజ్ డేట్ ప్రకటించారు. సంక్రాంతికి కాకుండా ఏప్రిల్‌లో 1న థియేటర్లలోకి తీసుకొస్తున్నట్లు తెలిపారు. కొత్త పోస్టర్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి