- జలాలు రావాల్సిందే
పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ ద్వారా రాయలసీమ జిల్లాలకు కృష్ణా జలాల తరలింపు అంశంపై రాష్ట్రంలోని ప్రతిపక్షాలు తీవ్రంగా స్పందించాయి. రోనా నిరోధంలో వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే కేసీఆర్, జగన్ ఈ విషయాన్ని తెరపైకి తెచ్చారని తెదేపా ఆరోపించింది. పూర్తి కథనం కోసం లింక్ క్లిక్ చేయండి.
- హల్ చల్
తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా మైలార్దేవపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో కాటేదాన్ అండర్ బ్రిడ్జి వద్ద స్థానికులు చిరుతను గుర్తించారు. జాతీయ రహదారిపై గాయపడిన చిరుతను చూసి ఆందోళనకు గురయ్యారు. పూర్తి కథనం కోసం లింక్ క్లిక్ చేయండి
- ఎన్కౌంటర్
జమ్ముకశ్మీర్‌లో మరోసారి ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. భద్రతా దళాలు నిర్బంధ తనిఖీలు చేస్తోన్న సమయంలో ఈ ఘటన జరిగింది. అప్రమత్తమైన భద్రతా దళాలు దీటుగా స్పందించాయి. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి.
- 'కూలీ'న బతుకులు
దేశవ్యాప్తంగా జరిగిన వేరువేరు ప్రమాదాల్లో 16 మంది వలసకూలీలు ప్రాణాలు కోల్పోయారు. మధ్యప్రదేశ్‌లోని గుణా జిల్లాలో అర్ధరాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 8 మంది చనిపోయారు. ముంబయి నుంచి వలస కూలీలతో ఉత్తర్‌ప్రదేశ్‌కు వెళుతున్న ట్రక్కును బస్సు ఢీ కొనగా ఈ ప్రమాదం జరిగింది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి.
- మొత్తం కట్టేస్తా
భారత్‌లో రూ.9 వేల కోట్లు అప్పు చేసి లండన్‌కు పారిపోయిన లిక్కర్ కింగ్ విజయ్‌మాల్యా.. ఆ బాకీ తిరిగి చెల్లిస్తానని ప్రకటించారు. 100 శాతం డబ్బులు తీసుకుని, తనపై ఉన్న మనీలాండరింగ్ కేసు కొట్టేయాలని కోరారు.పూర్తి కథనం కోసం లింక్ క్లిక్ చేయండి
- వదిలేలా లేదు
కరోనా వైరస్ ముగింపును అంచనా వేయలేమని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. ఈ మహమ్మారి మనతోనే జీవించే అవకాశం అధికంగా ఉందని స్పష్టం చేసింది. అయితే వ్యాక్సిన్‌ను కనిపెట్టగలమని ఆశాభావం వ్యక్తం చేసింది. పూర్తి కథనం కోసం లింక్ క్లిక్ చేయండి
- 'ఢీ' కొట్టే విటమిన్
కరోనాను ఎదుర్కొనేలా రోగనిరోధక వ్యవస్థకు విటమిన్-డి ఊతమిస్తోందని ఓ అధ్యయనం వెల్లడించింది. విటమిన్-డి పుష్కలంగా ఉండే వారిలో ఈ వైరస్‌ను ఎదుర్కొనే శక్తి ఉంటుందని తెలిపింది. పూర్తి కథనం కోసం లింక్ క్లిక్ చేయండి
- నిరాశే..!
దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభమయయ్యాయి. అంతర్జాతీయ ప్రతికూలతలకు తోడు, మదుపరులు లాభాల స్వీకరణ మొగ్గు చూపడమే ఇందుకు కారణం. పూర్తి కథనం కోసం లింక్ క్లిక్ చేయండి
- సెన్సార్ జారీ చేస్తాం
ఓటీటీలో విడుదల చేయాలనుకుంటున్న సినిమాలకు ధ్రువీకరణ పత్రం అందజేయడానికి హైదరాబాద్ సెన్సార్‌బోర్డ్ సుముఖత వ్యక్తం చేసింది. అవసరమైతే సర్టిఫికేట్లను ఈ-మెయిల్ ద్వారా జారీ చేస్తామని తెలిపారు.పూర్తి కథనం కోసం లింక్ క్లిక్ చేయండి
- క్రికెట్ చచ్చిపోతుంది..!
కరోనా ప్రభావం టెస్టు క్రికెట్‌పై తీవ్రస్థాయిలో ఉంటుందని అన్నాడు టీమ్ఇండియా మాజీ కోచ్ గ్రెగ్ ఛాపెల్. భారత్ వదిలేస్తే ఈ ఫార్మాట్ చచ్చిపోతుందని తెలిపాడు.పూర్తి కథనం కోసం లింక్ క్లిక్ చేయండి.