- ప్రజలందరికీ సత్వర న్యాయం చేకూర్చే బాధ్యత న్యాయవాదులపై ఉందన్న సీజేఐ
ప్రజలందరికి సత్వర న్యాయం చేకూర్చే బాధ్యత న్యాయవాదులపై ఉందని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ స్పష్టం చేశారు. పెండింగ్ కేసులను త్వరితగతిన పూర్తి చేయాల్సిన అవసరం ఉందన్న ఆయన న్యాయవ్యవస్థలో ఖాళీలను త్వరితగతిన భర్తీ చేస్తున్నట్లు చెప్పారు.
- మరో ఎస్సీ వ్యక్తికి సీఎం జగన్ ఉరి వేశారన్న చంద్రబాబు
Babu on YSRCP రాష్ట్రంలో రోజుకో దళితుడు ప్రాణాలు కోల్పోతున్నాడని తెదేపా అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా కావలి మండలం ముసునూరులో కరుణాకర్ అనే యువకుడి ఆత్మహత్యకు వైకాపా నేతల వేధింపులే కారణమని ఆయన ధ్వజమెత్తారు.
- ఒక్కసారి నమ్మి ఆదరించండి, ఎవ్వరూ చేయని విధంగా అభివృద్ధి చేస్తానన్న పవన్
పద్యం పుట్టిన రాయలసీమ నేలలో మద్యం ప్రవహిస్తోందని జనసేన అధినేత పవన్ మండిపడ్డారు. వైఎస్సార్ జిల్లా సిద్ధవటం కౌలు రైతు భరోసా బహిరంగ సభలో పాల్గొన్న పవన్ బాధిత కౌలు రైతు కుటుంబాలను పరామర్శించి ఆర్థికసాయం అందజేశారు. అనంతరం మాట్లాడిన ఆయన ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా కౌలు రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని మండిపడ్డారు.
- అమరావతికి వ్యతిరేకమైన ప్రభుత్వాన్ని గద్దె దించేందుకే రెండో విడత పాదయాత్ర
ప్రభుత్వం అమరావతిని పట్టించుకోకుండా మూడు రాజధానుల గురించి అలోచిస్తుందని రాజధాని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం మూడు రాజధానుల విషయంలో రాజ్యసభలో ప్రైవేటు బిల్లు పెట్టించడాన్ని అమరావతి ఐకాస నేతలు వ్యతిరేకించారు.
- టొమాటో ఫ్లూ డేంజర్ బెల్స్, 108 మందికి వ్యాధి, చిన్నారులకే ముప్పు
Tomato Flu భారత్‌లో మరో వైరస్ కలకలం రేపుతోంది. టొమాటో ఫ్లూ అనే వైరస్ కేరళ, ఒడిశాలలో విజృంభిస్తోంది. ఈ వ్యాధి ఎక్కువగా ఐదేళ్లలోపు పిల్లలకు సోకుతుందని ఓ అధ్యయనం తెలిపింది.
- కాటన్‌కు బదులు కండోమ్ కవర్లతో చికిత్స, పీహెచ్సీ సిబ్బంది నిర్లక్ష్యం
తలకు గాయమైన ఓ మహిళకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది చేసిన వైద్యం చర్చనీయాంశంగా మారింది. మహిళకు గాయం నుంచి రక్తం ఆగడానికి కండోమ్ కవర్‌ను పెట్టి కట్టు వేశారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో జరిగింది.
- ఆ దేశ ప్రధానికి డ్రగ్స్ పరీక్ష, మిత్రులతో పార్టీ చేసుకున్నందుకే
ఫిన్లాండ్ ప్రధాని సనా మారిన్ స్నేహితులతో కలిసి పార్టీ చేసుకుంటున్న వీడియో బహిర్గతం కావడం ఆ దేశ రాజకీయాల్లో దుమారం రేపుతోంది. పార్టీలో ప్రధాని డ్రగ్స్ తీసుకున్నారంటూ ప్రతిపక్ష నాయకులు ఆరోపణలు గుప్పించగా తాజాగా ఆమె డ్రగ్స్ పరీక్ష చేయించుకున్నారు.
- నెలకు రూ.9వేల పెన్షన్, అప్లై ఎలా చేసుకోవాలో తెలుసా
పింఛను హామీనిచ్చే ప్రధాన మంత్రి వయ వందన యోజన పథకం మరికొన్ని నెలల్లో ముగియనుంది. సీనియర్ సిటిజన్లు ఈ పథకానికి దరఖాస్తు చేయడానికి 2023 మార్చి 31వ తేదీని గడువుగా నిర్ణయించారు. ఈ పథకానికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇలా ఉన్నాయి.
- హీరోయిన్ రోజా కూతురిని చూశారా, సినిమాల్లో ఎంట్రీకి రంగం సిద్ధం
ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొన్ని సంవత్సరాల పాటు ఒక ఊపు ఊపింది సీనియర్ నటి రోజా. తెలుగు ఇండస్ట్రీలో ఉన్నటువంటి అగ్ర హీరోలందరితో కలిసి ఆమె నటించింది. ఇలా సినిమాల ద్వారా ఎంతో పేరు సంపాదించుకున్న రోజా ఆ తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి మరింత పాపులారిటీని పెంచుకుంది.
- రెండో వన్డేలోనూ భారత్ ఘన విజయం, సిరీస్ కైవసం
జింబాబ్వేతో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌ను భారత్ కైవసం చేసుకుంది. రెండో వన్డేలోనూ దూకుడు ప్రదర్శించింది. ఆతిథ్య జట్టును గత మ్యాచ్‌లో కంటే తక్కువ స్కోరుకే పరిమితం చేసింది. అయితే, తొలి వన్డేలో 10 వికెట్ల తేడాతో ప్రత్యర్థిని చిత్తు చేయగా.. తాజాగా ఐదు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.
9PM AP TOP NEWS ప్రధాన వార్తలు
ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు
top news