YSRCP Social Media Activist Varra Ravindra Reddy Escaped : వైఎస్సార్ జిల్లా పులివెందులకు చెందిన వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి పోలీసుల కళ్లుగప్పి పారిపోవడం సంచలనం రేకెత్తిస్తోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో విచ్చలవిడిగా సామాజిక మాధ్యమాల్లో ప్రతిపక్షాలపై అసభ్యకరమైన పోస్టులు పెట్టిన వర్రా రవీందర్ రెడ్డి ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో కూడా వాటిని కొనసాగిస్తూనే ఉన్నారు. కడప ఎంపీ అవినాష్ రెడ్డికి ముఖ్య అనుచరుడిగా ఉన్న రవీందర్ రెడ్డి సామాజిక మాధ్యమాల్లో సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు నారా లోకేశ్, అనితలపై పలు సందర్భాల్లో అసభ్యకరమైన పోస్టులు పెట్టారు.
జగన్‌ను విమర్శిస్తే అది ఎవరైనా సరే : వైఎస్సార్సీపీ హయాంలో జగన్‌ను విమర్శించిన ప్రతిసారి చంద్రబాబు, లోకేశ్‌పైన అసభ్యకరమైన పోస్టులు పెట్టి, పైశాచిక ఆనందం పొందేవారు. అంతటితో ఆగకుండా వివేక హత్య కేసులో జగన్ పైన అవినాష్ రెడ్డి పైన ఎన్నికల సమయంలో తీవ్రమైన విమర్శలు చేసిన సునీత, షర్మిలపైన కూడా రవీందర్ రెడ్డి అసభ్య కరమైన రీతిలో సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారు. జగనన్న ఆదేశిస్తే దేనికైనా సిద్ధమే అన్న విధంగా పోస్టులు పెట్టారు. 'అవసరమైతే సునీతను కూడా లేపేయండి' అన్న అంటూ రాయలేని భాషలో సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారు. విజయమ్మపైనా అసభ్యకర పోస్టులకు వెనకాడలేదు. రవీందర్ రెడ్డి పోస్టులపై మనస్థాపానికి గురైన వివేకా కుమార్తె సునీత, సైబరాబాద్‌లో సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేశారు. షర్మిల కూడా హైదరాబాద్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది.
పులివెందులలో వర్రా ప్రత్యక్షం- దర్జాగా జగన్ క్యాంప్ ఆఫీస్‌లోనే - YSRCP Social Media Activist Varra
రహస్యంగా విచారణ : ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలోనూ సీఎం చంద్రబాబు, లోకేశ్, పవన్ కల్యాణ్, అనితకు వ్యతిరేకంగా అత్యంత హేయమైన రీతిలో రవీందర్ రెడ్డి పోస్టులు పెడుతుండగా పులివెందుల, మంగళగిరి, హైదరాబాద్‌లో పలు కేసులు నమోదు అయ్యాయి. రెండు రోజుల కింద తీవ్రంగా మాట్లాడిన నేపథ్యంలో కడప పోలీసులు రవీందర్‌రెడ్డిని మంగళవారం సాయంత్రం అదుపులోకి తీసుకొని కడప తాలూకా పోలీస్ స్టేషన్ తీసుకువచ్చారు. అది కూడా పులివెందులకు చెందిన ఓ వైఎస్సార్సీపీ నాయకుడి సూచనల మేరకు అతని అదుపులోకి తీసుకొని 41-A నోటీసు ఇచ్చి వదిలేశారు.
నోటీసు ఇచ్చే వదిలేసే సమయంలో రవీందర్ రెడ్డిని మరో కేసులో అదుపులోకి తీసుకోవడానికి రాజంపేట పోలీసులు మంగళవారం రాత్రి తాలూకా పోలీస్ స్టేషన్ దగ్గర సిద్ధంగా ఉన్నారు. కడప పోలీసులు నేరుగా రాజంపేట పోలీసులకు రవీందర్ రెడ్డిని అప్పగించకుండా బయటికి వదిలేసారు. రాత్రి సమయంలో రవీందర్ రెడ్డి పోలీసుల కళ్లుగప్పి పారిపోయారు. ఈ విషయం రాష్ట్ర ప్రభుత్వము ముఖ్యంగా సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లడంతో జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజుపైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. కర్నూల్ రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ వెంటనే కడపకు వెళ్లి కేసు వివరాల పైన ఆరా తీయాలని సీఎం ఆదేశించారు.
ANUSHA: "తెదేపా మహిళలపై... అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారు"
'నేనింతే - నా తీరింతే - అసెంబ్లీకి రానంతే' - Jagan on Speaker Election Process