ETV Bharat / city

TOP NEWS: ప్రధాన వార్తలు @ 9 AM - ఏపీ వార్తలు

.

TOP NEWS
ప్రధాన వార్తలు
author img

By

Published : Jul 14, 2022, 8:58 AM IST

  • బక్కజీవిపై వరుస పిడుగులు.. ఏటా వెంటాడుతున్న విపత్తులు
    Farmers problems: వాతావరణ మార్పులతో రైతులకు జరిగే నష్టం ఊహకందని స్థాయిలో ఉంటోంది. భారీవర్షాలు, వరదలతో రైతులు మూడేళ్లుగా నిలువునా మునిగారు. ఒక నెల వానలు ముఖం చాటేస్తే.. మరో నెలలో విరుచుకుపడుతున్నాయి. పెట్టుబడులు పెరిగి, గిట్టుబాటు ధరలు దక్కక రైతులు అప్పుల పాలవుతున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • కాగితాల్లోనే జూనియర్‌ కళాశాలలు.. 292 హైస్కూల్‌ ప్లస్‌లో పాఠాలు చెప్పేవారు లేరు
    Junior colleges: ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ఇంటర్మీడియట్‌ తరగతులు మొదలు కాకపోయినా జులై ఒకటి నుంచి తరగతులు పునఃప్రారంభమైనట్లు.. పాఠశాల విద్యాశాఖ అకడమిక్‌ కేలండర్‌ విడుదల చేయడం అందర్నీ అయోమయానికి గురి చేస్తోంది.ఉపాధ్యాయ పోస్టుల హేతుబద్దీకరణలో మిగిలే స్కూల్‌ అసిస్టెంట్లకు ఒక ఇంక్రిమెంట్‌ ఇచ్చి లెక్చరర్లుగా నియమించాలని భావించినా ఇది పూర్తి కాలేదు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • ఆ అప్పుకు నాలుగేళ్లపాటు మినహాయింపు.. రాష్ట్రాలకు కేంద్రం వెసులుబాటు
    Loan exception: దేశంలోని అన్ని రాష్ట్రాలకూ కేంద్రం ఆర్థిక వెసులుబాటు కల్పించింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రాలు బడ్జెట్‌లో చూపకుండా చేసిన రుణాలను.. ఒకేసారి రుణ పరిమితి నుంచి మినహాయించబోమని స్పష్టం చేసింది. అప్పు ఎంత తీసుకుంటే అంత మొత్తాన్ని నాలుగేళ్లపాటు సమంగా మినహాయించి.. 2026 మార్చి వరకూ రుణ పరిమితిని నిర్దేశిస్తామని స్పష్టం చేసిందని సమాచారం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • వరద సన్నద్ధత ఏదీ?
    Godavari flood equipment tenders: గోదావరి వరద ముంచెత్తుతున్నా ఇప్పటికీ జలవనరులశాఖ అందుకు సన్నద్ధంగా లేదనే విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుతం గోదావరి వరదను సమర్థంగా ఎదుర్కొనేందుకు అవసరమైన ఇంజినీర్లు, అధికారులు కూడా లేరు. వరద వచ్చే సమయానికి సిద్ధం చేసుకోవాల్సిన సామగ్రినీ అధికారులు సమకూర్చలేదు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • ఈనెల 17న అఖిలపక్ష భేటీ.. 18 నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు
    ఈనెల 18 నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కావటంతో పాటు అదే రోజు రాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. ఈ నేపథ్యంలో 17న ఉదయం అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని పార్లమెంటరీ వ్యవహారాలశాఖ నిర్ణయించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • మళ్లీ జికా వైరస్​ కలకలం.. ఏడేళ్ల బాలికకు పాజిటివ్​
    Zika Virus: దేశంలో తాజాగా కరోనా కేసులు పెరుగుతున్న సమయంలో జికా వైరస్ కేసు వెలుగు చూసింది. మహారాష్ట్రకు చెందిన ఓ ఏడేళ్ల బాలిక.. జికా వైరస్​ బారిన పడినట్లు అధికారులు తెలిపారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • లింగ సమానత్వ సూచీలో 135వ స్థానంలో భారత్.. అగ్రస్థానం ఎవరిదంటే?
    gender gap report 2022: లింగ సమానత్వ సూచీలో భారత్ 135వ స్థానంలో నిలిచింది. ప్రపంచ ఆర్థిక ఫోరానికి చెందిన జండర్ గ్యాప్ రిపోర్ట్- 2022లో ఈ విషయాలు బయటపడ్జాయి. స్తీ, పురుష సమానత్వంలో ఐస్‌లాండ్‌ అగ్రస్థానంలో నిలిచింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • సెజ్‌ స్థానంలో దేశ్‌.. బిల్లు ప్రవేశ పెట్టేందుకు కేంద్రం కసరత్తు
    ప్రత్యేక ఆర్థిక మండళ్ల (సెజ్‌) స్థానంలో డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ ఎంటర్‌ప్రైజ్‌ అండ్‌ సర్వీస్‌ హబ్‌ (డీఈఎస్‌హెచ్‌-దేశ్‌) విధానాన్ని తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందుకు సంబంధించిన ముసాయిదా బిల్లును ఇప్పటికే పారిశ్రామిక వేత్తలకు పంపి, అభిప్రాయసేకరణ చేపట్టింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • 'అలా ఆడితే ఎల్బీడబ్ల్యూ ఇవ్వాలి.. వన్డే క్రికెట్ ప్రాధాన్యత చాటుకోవాలి'
    ఎల్బీడబ్ల్యూకి సంబంధించిన రూల్స్‌లో కొన్ని మార్పులు చేయాల్సిన అవసరం ఉందని టీమ్‌ఇండియా సీనియర్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ అభిప్రాయపడ్డాడు. బ్యాటర్ స్విచ్‌ షాట్‌కు ప్రయత్నించినప్పుడు బంతి మిస్‌ అయి ప్యాట్‌పైకి వెళ్లి వికెట్లను తాకేలా ఉంటే ఎల్బీడబ్ల్యూ ఇవ్వాలని సూచించాడు. వన్డే క్రికెట్‌ తన ప్రాధాన్యతను చాటుకోవాల్సిన అవసరముందన్నాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • మిథాలీ, నా ఆలోచనలు ఒకేలా ఉంటాయి: తాప్సీ
    taapsee pannu mithali raj: క్రికెటర్ మిథాలీ రాజ్ ప్రయాణం నచ్చే 'శభాష్ మిథు' సినిమా చేశానని అన్నారు ప్రముఖ నటి తాప్సి. ఆమె ప్రధాన పాత్రధారిగా తెరకెక్కిన ఈ చిత్రం ఆ నెల 15న ప్రేక్షకుల ముందుకొస్తోంది. మిథాలీ రాజ్​, తన ఆలోచనలు ఒకేలా ఉంటాయని తెలిపారు తాప్సి. యువ క్రీడాకారులకు అవకాశం ఇవ్వాలనే రిటైర్మెంట్ ప్రకటించానని మిథాలీ రాజ్ అన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.