- గోదావరి మహోగ్రరూపం.. లంకగ్రామాలు విలవిల
గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఎటుచూసినా నీరే.. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో వరద ఉద్ధృతి అంతకంతకూ పెరుగుతోంది. ధవళేశ్వరం వద్ద కాటన్ బ్యారేజీకి జలాలు పోటెత్తుతున్నాయి. రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. గురు, శుక్రవారాల్లో ఉద్ధృతి మరింత పెరిగి మూడో ప్రమాద హెచ్చరిక జారీచేసే అవకాశం ఉండవచ్చని అంచనా. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- CM Jagan review : ఆగస్టు 1 నుంచి ఆరోగ్యశ్రీలో మరిన్ని చికిత్సలు: సీఎం జగన్
CM Jagan review : ఆరోగ్య శ్రీ ద్వారా అందించే చికిత్సల జాబితాను మరింత పెంచాలని అధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారు. ఆగస్టు 15 నుంచి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌ను అందుబాటులోకి తీసుకురావాలన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- రూసా నిధులు 180 కోట్ల మళ్లింపు..పెండింగ్‌లో రూ.46 కోట్ల బిల్లులు
ఉన్నత విద్యా సంస్థల్లో మౌలిక సదుపాయాలను కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రీయ ఉచ్చతర్ శిక్ష అభియాన్ (రూసా) కింద ఇచ్చిన రూ.180 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఇతర పథకాలకు మళ్లించింది. దీంతో నిధులు లేక రూసా పనులు ముందుకు సాగడం లేదు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Roads: గజానికో గుంత.. దారంతా చింత
రాష్ట్రంలో రోడ్ల సొగసు నాలుగు వానలకే బట్టబయలైంది. అసలే అధ్వానంగా ఉన్న నగర, పట్టణ రహదారులన్నీ వానలకు మరింత దెబ్బతిన్నాయి. పెద్ద పెద్ద గుంతల్లో నీళ్లు నిలిచి చెరువుల్లా మారాయి. అందులో దిగితే ఎంత లోతు ఉంటుదో తెలియదు.. దిగకపోతే ప్రయాణం సాగదు.. ఈ గందరగోళం మధ్య వాహనచోదకులు ప్రయాణమంటేనే హడలిపోతున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఈనెల 17న అఖిలపక్ష భేటీ.. 18 నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు
ఈనెల 18 నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కావటంతో పాటు అదే రోజు రాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. ఈ నేపథ్యంలో 17న ఉదయం అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని పార్లమెంటరీ వ్యవహారాలశాఖ నిర్ణయించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ప్రియురాలిపై అనుమానంతో హత్య.. ఆపై యువకుడు ఆత్మహత్య
ప్రియురాలిపై అనుమానంతో ఓ యువకుడు ఆమెను బ్లేడుతో గొంతు కోసి హత్య చేశాడు. ఆపై తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పుర్‌లో జరిగింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- శ్రీలంక తర్వాత వంతు పాకిస్థాన్‌దేనా..?
ఆర్థికంగా పెను సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంక దివాలా తీయగా.. తాజాగా పాకిస్థాన్ కూడా అదే బాట పట్టే ప్రమాదం కనిపిస్తోంది. ప్రతి నెలా పాక్ విదేశీ రిజర్వులు అడుగంటుతున్నాయి. ద్రవ్యోల్బణం గణనీయంగా పెరిగి లీటరు పాల ధర 260 పాకిస్థానీ రూపాయలుగా ఉంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- సెజ్ స్థానంలో దేశ్.. బిల్లు ప్రవేశ పెట్టేందుకు కేంద్రం కసరత్తు
ప్రత్యేక ఆర్థిక మండళ్ల (సెజ్) స్థానంలో డెవలప్‌మెంట్ ఆఫ్ ఎంటర్‌ప్రైజ్ అండ్ సర్వీస్ హబ్ (డీఈఎస్‌హెచ్-దేశ్) విధానాన్ని తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందుకు సంబంధించిన ముసాయిదా బిల్లును ఇప్పటికే పారిశ్రామిక వేత్తలకు పంపి, అభిప్రాయసేకరణ చేపట్టింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- రెండో వన్డే కోసం భారత్- ఇంగ్లాండ్ సన్నద్ధం.. సిరీస్‌పై కన్నేసిన రోహిత్ సేన
క్రికెట్ మక్కా లార్డ్స్ వేదికగా భారత్, ఇంగ్లండ్ మధ్య రెండోవన్డే గురువారం జరగనుంది. తొలి వన్డే విజయం ఇచ్చిన ఆత్మవిశ్వాసంతో రెండో మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని టీమ్ఇండియా భావిస్తుండగా ఈ మ్యాచ్‌లో నెగ్గి సిరీస్ సమం చేయాలని ఆతిథ్య జట్టు పట్టుదలగా ఉంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- మొదటి భార్య పేరు కలిసేలా.. దిల్‌రాజు కొడుకు పేరు..!
స్టార్ ప్రొడ్యూసర్ దిల్‌రాజు సతీమణి తేజస్విని ఇటీవల పండంటి మగ బిడ్డకు జన్మనివ్వగా.. తాజాగా ఆ చిన్నారికి పేరు పెట్టేశారట. అయితే తన మొదటి భార్య పేరు కలిసేలా.. కొడుకు పేరు పెట్టారట దిల్‌రాజు. ఇంతకీ ఆ పేరు ఏంటంటే? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
TOP NEWS: ప్రధాన వార్తలు @ 7 AM
.
ప్రధాన వార్తలు @ 7 AM