- జులై 5 నుంచి మోగనున్న బడిగంట.. అకడమిక్ కేలండర్ రిలీజ్
రాష్ట్రంలోని పాఠశాలలు జులై 5 నుంచి పునఃప్రారంభమై.. వచ్చే ఏడాది ఏప్రిల్ 29వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఇప్పటి వరకు ప్రతి ఏడాది జూన్ 12న పాఠశాలలు పునఃప్రారంభమై ఏప్రిల్ 23వరకు కొనసాగేవి. ఈ ఏడాది పునఃప్రారంభ సమయాన్ని మార్చేశారు. జులై ఐదో తేదీకి తీసుకొచ్చారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- "అమ్మఒడి" కోల్పోయిన వాళ్లు.. 51 వేల మంది!
కనీసం 75శాతం హాజరు ఉండాలనే నిబంధన అమలుతో.. 51 వేల మంది తల్లులు 2021-22 విద్యా సంవత్సరానికి అమ్మఒడి లబ్ధి కోల్పోయినట్లు.. రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. డ్రాపవుట్లను తగ్గించాలనే ఉద్దేశంతోనే కనీస హాజరు నిబంధన పెట్టామని వివరించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- TTD: నేడు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల
TTD: తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల సెప్టెంబరు నెల కోటాను.. తితిదే ఆన్లైన్లో ఇవాళ విడుదల చేయనుంది. మొత్తం 46,470 టికెట్లలో లక్కీడిప్ ద్వారా 8,070 టికెట్లు కేటాయించనున్నారు. టికెట్లు పొందిన వారి జాబితాను ఈ నెల 29వ తేదీ మధ్యాహ్నం 12 గంటల తరువాత వెబ్‌సైట్‌లో పొందుపరుస్తారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- "వైకాపా నాయకా.. ఆ యంత్రాలు స్వచ్ఛభారత్ కోసం.. మీ కోసం కాదు"!
స్వచ్ఛభారత్ పథకం కింద గ్రామానికి కేటాయించిన యంత్రాన్ని.. ఓ వైకాపా నాయకుడు తన సొంత పనులకు వినియోగించుకోవడం చర్చనీయాంశమైంది. తన ఇంటి ముందు ఉన్న మట్టిని చదును చేసేందుకు.. స్వచ్ఛభారత్ యంత్రాలను వినియోగించుకున్న ఘటన.. శ్రీ సత్యసాయి జిల్లాలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- తీస్తాకు జులై 2 వరకు పోలీసు కస్టడీ.. కేసు విచారణకు సిట్
ఫోర్జరీ, నేరపూరిత కుట్ర తదితర ఆరోపణలపై ప్రముఖ సామాజిక కార్యకర్త తీస్తా సీతల్వాడ్‌ను అరెస్ట్ చేసినట్లు ప్రకటించారు పోలీసులు. న్యాయస్థానంలో హాజరుపరచగా.. తీస్తాతో పాటు మాజీ డీజీపీ శ్రీకుమార్‌ను జులై రెండు వరకు పోలీసు కస్టడీకి అప్పగించింది కోర్టు. ఈ సందర్భంగా పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు తీస్తా. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- నేడు యశ్వంత్ సిన్హా నామినేషన్.. విజయ్‌చౌక్‌లో విపక్ష నేతల భేటీ
president election 2022: విపక్ష పార్టీల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా సోమవారం మధ్యాహ్నం 12.15 గంటలకు నామినేషన్ వేయనున్నారు. ఆయన వెంట కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తదితరులు ఉండనున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఈ దిండు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనది.. ధర ఎంతో తెలుసా?
మన ఇంట్లో ఉండే దిండు ధర మహా అయితే.. ఓ వెయ్యి, రెండు వేల వరకు ఉంటుంది. లక్షల్లో ఉంటుందని ఎప్పుడైనా ఊహించారా? నెదర్లాండ్‌కు చెందిన ఓ వ్యక్తి ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన దిండును తయారు చేశారు. దాని ధర ఎంత.. విశేషాలేమిటి? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఫిన్‌టెక్ భాగస్వామ్యంతో బ్యాంకుల రుణాలు!
Finance ministry on fintech: ఫిన్‌టెక్ సంస్థలతో కలిసి రుణాలు ఇచ్చే (కో-లెండింగ్) అవకాశాలను పరిశీలించాల్సిందిగా ప్రభుత్వ రంగ బ్యాంకులను ఆర్థిక శాఖ ఆదేశించింది. రుణ వృద్ధి కోసం సాంకేతికత వినియోగం, డేటా అనలిటిక్స్‌పై దృష్టి పెట్టాల్సిందిగా సూచించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- IRE vs IND: తొలి టీ20లో ఐర్లాండ్‌పై భారత్ ఘనవిజయం
Ind vs Ireland: ఐర్లాండ్‌తో రెండు టీ20ల సిరీస్‌లో భారత్ శుభారంభం చేసింది. ఆతిథ్య జట్టు విసిరిన 108 పరుగుల లక్ష్యాన్ని టీమ్ఇండియా అలవోకగా ఛేదించి సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. సిరీస్‌లో చివరిదైన రెండో టీ20 మంగళవారం జరగనుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'చిరంజీవి బొమ్మలు, బ్యానర్లు వేసేవాడు.. ఇలాంటి రోజు వస్తుందని ఊహించడు'
బందరులో ఉండగా మెగాస్టార్ చిరంజీవి బొమ్మలు, బ్యానర్లు వేసేవాడినని చెప్పారు దర్శకుడు మారుతి. ఆయన తెరకెక్కించిన పక్కా కమర్షియల్ చిత్రానికి చిరు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ క్రమంలోనే చిరును ఉద్దేశించి.. ఆయన వల్లే తాను దర్శకుడిగా మారానని తెలిపారు. తనలాంటి చిన్న స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి ఈ రోజు ఇలాంటి స్థితిలో ఉండటం సాధారణ విషయం కాదని అన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
TOP NEWS: ప్రధాన వార్తలు @ 9 AM - andhra pradesh news
.

ప్రధాన వార్తలు