- Nari Sankalpa Deeksha : 'నిందలు మోపడం ఆపి... మహిళలకు రక్షణ కల్పించండి'
తెదేపా కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో తెలుగు మహిళా ఆధ్వర్యంలో నేడు నారీ సంకల్ప దీక్ష చేయనున్నారు. విజయవాడలో 9వ తరగతి బాలిక ఆత్మహత్య ఘటన బాధాకరమని, నిందితుడు వినోద్ జైన్‌ను ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత డిమాండ్ చేశారు. తమపై నిందలు మోపడం ఆపి మహిళలకు రక్షణ కల్పించడంపై పాలకులు దృష్టి పెట్టాలని ఆమె కోరారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- నారీ దీక్షకు వెళుతుండగా అనంతపురం మాజీ మేయర్ అడ్డగింత
నారీ దీక్షకు వెళుతుండగా అనంతపురం మాజీ మేయర్ స్వరూపను పోలీసులు అడ్డగించారు. గుంతకల్లు రైల్వే స్టేషన్లో ఆమెను బలవంతంగా రైలు నుంచి దింపేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- girl suicide in visakha : పుట్టిన రోజుకు బట్టలు కొనివ్వలేదని... బాలిక ఆత్మహత్య
ఇటీవల కాలంలో మైనర్ ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. మరీ ముఖ్యంగా తల్లిదండ్రులపై అలిగి.. చిన్న చిన్న విషయాలకే తనువు చాలిస్తున్నారు. ఇష్టమైన ఫుడ్ ఇప్పించలేదని, ఫోన్ కొనివ్వలేదని, సినిమాకు డబ్బులివ్వలేదని... వంటి కారణాలతో అనేక మంది తమ ప్రాణాలను బలి తీసుకుంటున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే విశాఖ జిల్లాలో జరిగింది. రానున్న పుట్టిన రోజు బట్టలు కొనివ్వలేదని ఓ బాలిక ఆత్మహత్య చేసుకుంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- Death of Migratory birds : వలస పక్షుల మృత్యుఘోష... ఒక్క నెలలోనే వంద మృతి
శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలంలో వలస పక్షులు మృత్యువాత పడుతున్నాయి. నెల వ్యవధిలోనే 100 పక్షులు నేలరాలాయి. పక్షుల మరణాలకు కారణాలు ఇప్పటివరకూ పూర్తిస్థాయిలో అధికారులు గుర్తించలేకపోతున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- పరిమితుల మధ్యే నిర్మలమ్మ బడ్జెట్ కసరత్తు.. వరాలిస్తారా?
ఆర్థిక వ్యవస్థ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న నేపథ్యంలో ఈ సారి బడ్జెట్లో పెద్దగా తాయిలాలు, వినూత్న సంస్కరణల జోలికి వెళ్లకుండానే ఆర్థిక మంత్రి కసరత్తు పూర్తిచేసే అవకాశాలున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. గత రెండేళ్లుగా కొవిడ్ మహమ్మారితో అతలాకుతలమై ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఆర్థిక వ్యవస్థ ఈ బడ్జెట్‌పై చాలా ఆశలు పెట్టుకొందని చెప్తున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- 'మోదీకి అహంకారంతో కళ్లు మూసుకుపోయాయి!'
నిరుద్యోగంపై యువత పోరాటం చేస్తున్నా.. ప్రధాని నరేంద్ర మోదీ మాత్రం ఇవన్నీ పట్టనట్లు ఆహంకారంతో కళ్లు మూసుకుని కూర్చున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. దేశంలో సుమారు మూడు కోట్లకు పైగా మంది నిరుద్యోగులు ఉన్నారని రాహుల్ తెలిపారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- వాటి అనుసంధానికి ఒకే డిజిటల్ ఐడీ.!
'ఒకే డిజిటల్ ఐడీ' మరోసారి తెరమీద వచ్చింది. దీనిని రూపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇది అమలులోకి వస్తే ఆధార్, డ్రైవింగ్ లైసెన్సు, పాస్‌పోర్ట్, పాన్.. ఇలాంటి గుర్తింపు పత్రాలన్నింటినీ ఒకే ఐడీకి అనుసంధానం చేస్తారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- 'ఉక్రెయిన్‌కు బలగాలనుపంపే యోచన లేదు'
అమెరికా బలగాలను ఉక్రెయిన్‌కు పంపే ఆలోచన తమకు లేదని నాటో సెక్రటరీ జనరల్ తెలిపారు. ఆ దేశ సరిహద్దుల్లో రష్యా బలగాలు ఏ క్షణమైన దాడికి పాల్పడే అవకాశమున్న నేపథ్యంలో నాటో చీఫ్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- 'క్లే కోర్టు' కింగ్ రఫెల్ నాదల్.. 21 ఏళ్లు.. 21 గ్రాండ్‌స్లామ్‌లతో రికార్డు
ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ ఫైనల్లో యువ ఆటగాడు మెద్వెదెవ్పై విజయం సాధించి మరో గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను ఖాతాలో వేసుకున్నాడు స్పెయిన్ బుల్ రఫేల్ నాదల్. దీంతో అత్యధికంగా 21 గ్రాండ్‌స్లామ్‌లు గెలిచిన వీరుడిగా నిలిచాడు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- 'కోటికొక్కడు 3' రిలీజ్‌కు రెడీ.. అజిత్ సినిమాలో మోహన్‌లాల్
సినీ అప్డేట్స్ వచ్చేశాయి. ఇందులో కోటికొక్కడు రిలీజ్ డేట్‌తో పాటు అజిత్ చిత్రంలో మోహన్‌లాల్ నటించడం గురించిన సంగతులు ఉన్నాయి. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి