- పీఆర్సీ సాధన సమితి నేతలకు మరోసారి ప్రభుత్వం పిలుపు
పీఆర్సీ సాధన సమితి నేతలకు మరోసారి ప్రభుత్వం నుంచి చర్చల పిలుపు వచ్చింది. సచివాలయంలో మధ్యాహ్నం 12 గంటలకు చర్చలకు రావాలని ప్రభుత్వం ఆహ్వానించింది.పీఆర్సీపై ప్రభుత్వ కమిటీతో చర్చలకు రావాలని …..స్టీరింగ్ కమిటీలోని 20 మంది సభ్యులనుసాధారణ పరిపాలనా శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ ఆహ్వానించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- ఎమ్మెల్యేలకు పాఠశాల విద్యాశాఖ వర్క్ షాప్..ఎందుకంటే ?
జాతీయ విద్యా విధానం ప్రకారం రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల మ్యాపింగ్ పై శాసన సభ్యులకు మూడు రోజుల పాటు అవగాహన కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహించనుంది. ఏపీ సచివాలయంలో రేపటి నుంచి మూడు రోజుల పాటు ఎమ్మెల్యేలకు పాఠశాల విద్యాశాఖ ఏర్పాటు చేయనుంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- FLEXI: గుండ్లపాడులో ఫ్లెక్సీ వివాదం... విచారణ చేస్తున్న పోలీసులు
గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడులో మళ్లీ అలజడి మొదలయింది. గుండ్లపాడు గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు తోట చంద్రయ్య దిశ దిన కార్యక్రమం సందర్భంగా కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు చించేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- గూడ్సు పైకెక్కి సెల్ఫీకి యువకుడి యత్నం...విద్యుదాఘాతంతో తీవ్రగాయాలు...
సెల్ఫీ మోజు ప్రాణాల మీదకు తెస్తున్న ఘటనలు నిత్యం ఎక్కడో ఒక చోట వార్తల్లో నిలుస్తున్నాయి. తాజాగా గుంటూరు జిల్లా పిడుగురాళ్లో కూడా అలాంటి ఘటనే చోటు చేసుకుంది. గూడ్సుపైకెక్కి సెల్ఫీలు తీసుకోబోయిన ఓ యువకుడు విద్యుదాఘాతంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- కరోనా విజృంభణ- ఒక్కరోజే 2.86 లక్షల కేసులు.. 573 మరణాలు
భారత్‌లో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. కొత్తగా 2,86,384 మందికి వైరస్ సోకింది. ఒక్కరోజులో 573 మంది మరణించారు. 3,06,357 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- ఒంట్లో బంగారం ముద్దలు.. కొరియర్ బ్యాగ్‌లో 5.3 కోట్ల హెరాయిన్
మాదక ద్రవ్యాలను, బంగారాన్ని అక్రమంగా తరలించడానికి వేర్వేరు మార్గాలను ఎంచుకుంటున్నారు దుండగులు. బంగారం ముద్దలను శరీరంలో దాచుకున్న ఓ వ్యక్తిని కర్ణాటకలో కస్టమ్స్ అధికారులు అరెస్టు చేశారు. మరో ఘటనలో దుబాయ్ నుంచి కొరియర్లో వచ్చిన రూ.5.3 కోట్ల విలువైన హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- ఎన్నికల బరిలో యువకిశోరాలు.. గెలుపుతో బోణీ కొడతారా?
పంజాబ్‌లో పలువురు యువకిశోరాలకు కాంగ్రెస్ టికెట్లు ఇచ్చింది. వీరంతా ఎన్నికల్లో ఎలా రాణిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ప్రముఖ నటుడు సోనూసూద్ సోదరి సహా పలువురు యువనేతలు బరిలోకి దిగుతున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- వెనక్కి తగ్గని కిమ్.. మరోసారి క్షిపణి ప్రయోగాలు
ఉద్రిక్తతలకు ఆజ్యం పోసేలా ఉత్తర కొరియా మరోసారి క్షిపణి ప్రయోగాలు చేపట్టింది. రెండు బాలిస్టిక్ క్షిపణులను జపాన్ సముద్రంలోకి ప్రయోగించిందని దక్షిణ కొరియా సైనికాధికారులు పేర్కొన్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- కెప్టెన్‌గా కోహ్లీ, రోహిత్ ఎలా ఉంటారంటే?
రోహిత్ శర్మ, కోహ్లీ వ్యవహార శైలిని రవిశాస్త్రి తనదైన శైలిలో విశ్లేషించాడు. విరాట్ డేంజరస్‌గా ఓ బీస్ట్‌లా వ్యవహరిస్తాడని.. హిట్‌మ్యాన్ చాలా రిలాక్స్‌గా ఉంటాడని చెప్పాడు. కోహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంపై జాంటీ రోడ్స్, సంజయ్ మంజ్రేకర్, స్టీవ్‌స్మిత్ తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- దీపిక బోల్డ్ సీన్స్.. భర్త రణ్వీర్ రియాక్షన్ ఏంటి?
కొత్త సినిమాలో దీపిక చెలరేగిపోయింది. బోల్డ్ సీన్స్‌తో చూపు తిప్పుకోనివ్వకుండా చేసింది. అయితే వీటిని చూసి ఆమె భర్త ఏమన్నారో తెలుసా? పూర్తి వివరాలకు క్లిక్ చేయండి