- rosaiah passes away: రేపు కొంపల్లి ఫామ్‌హౌస్‌లో రోశయ్య అంత్యక్రియలు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య(88) కన్నుమూశారు. ఈ ఉదయం ఇంట్లో పల్స్ పడిపోవడంతో కుటుంబ సభ్యులు ఆయనను హైదరాబాద్‌లోని స్టార్ ఆస్పత్రికి తీసుకువెళ్తుండగా మార్గమధ్యలో మరణించారు. ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంటకు కొంపల్లిలోని ఫామ్‌హౌస్‌లో రోశయ్య అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ నేత కేవీపీ తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Justice N. V. Ramana: 'ఆర్బిట్రేషన్ కేంద్రం ఏర్పాటుకు హైదరాబాద్ సరైన వేదిక'
Justice N. V. Ramana: కోర్టుకు రావడమనేది ఆఖరి ప్రత్యామ్నాయం కావాలని సీజేఐ జస్టిస్ ఎన్.వి. రమణ అభిప్రాయపడ్డారు. కోర్టులకు వచ్చేముందే తక్కువ సమయంలో మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కారాలు చేసుకోవచ్చని సూచించారు. హైదరాబాద్‌లో జరిగిన అంతర్జాతీయ ఆర్బిట్రేషన్, మీడియేషన్ కేంద్రం సన్నాహక సదస్సులో జస్టిస్ ఎన్.వి. రమణ పాల్గొన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- jawad cyclone effect: ఉప్పాడ తీరంలో అలల ఉద్ధృతి.. బీచ్‌రోడ్డులో రాకపోకలు నిలిపివేత!
తుపాను ప్రభావంతో తూర్పు గోదావరి జిల్లా కాకినాడ ఉప్పాడ తీరంలో కెరటాల్ ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. అప్రమత్తమైన అధికారులు బీచ్‌రోడ్డు మీదుగా రాకపోకలను నిలిపివేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- farmers padayatra: తిప్పవరప్పాడు వద్ద రైతుల మహాపాదయాత్రకు ఘన స్వాగతం
amaravathi farmers padayatra in gudur: రాజధాని రైతులు చేపట్టిన మహా పాదయాత్ర.. 34వ రోజైన నెల్లూరు జిల్లా గూడూరులో సాగుతోంది. పాదయాత్ర వెంకటగిరి నియోజకవర్గం సైదాపురం నుంచి ప్రారంభమై.. గూడూరు నియోజకవరం పుట్టంరాజువారి కండ్రిగ వద్ద ముగియనుంది. సుమారు 11కిలో మీటర్ల మేర ఈ పాదయాత్ర సాగనుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- JAWAD CYCLONE: తుపాను కారణంగా పోటీ పరీక్షలు వాయిదా
cyclone effect: రాష్ట్రంలో తుపాన్ కారణంగా రైళ్ల రద్దు, పాఠశాలల బంద్‌తో పాటు... జాతీయ పరీక్షల విభాగం నిర్వహించే యూజీసీ-నెట్ పరీక్షను కూడా వాయిదా వేశారు. ఎపీ, ఒడిశా, పశ్చిమ బెంగాల్లో పరీక్షలు ఎప్పుడు నిర్వహించబోయేది త్వరలోనే ప్రకటిస్తామన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 5లక్షల ఏకే-203 రైఫిల్స్ తయారీకి భారత్ గ్రీన్ సిగ్నల్
Ak 203 rifle Indian army: 5లక్షలకుపైగా ఏకే-203 రైఫిల్స్ తయారీకి కేంద్రం పచ్చజెండా ఊపింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని అమేఠీలో వీటిని తయారు చేయనున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఉక్రెయిన్‌పై దండయాత్రకు రష్యా ప్రణాళిక- అమెరికా హెచ్చరిక!
Russia offensive Ukraine: ఉక్రెయిన్‌పై సైనిక చర్యలకు రష్యా రంగం సిద్ధం చేస్తోందని అమెరికా నిఘా వర్గాలు పసిగట్టాయి. సరిహద్దుల్లో లక్షలాది మంది సైనికులను పంపించేందుకు పుతిన్ ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోందని తెలిపాయి. దీనిపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఘాటుగా స్పందించారు. రష్యాను ఎట్టిపరిస్థితుల్లోనైనా అడ్డుకుంటామని తేల్చిచెప్పారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Gold Price Today: పెరిగిన బంగారం ధర.. ఏపీ, తెలంగాణలో ఎంతంటే?
Gold Price Today: ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బంగారం ధర భారీగా పెరిగింది. వెండి ధర కాస్త వృద్ధి చెందింది. ఇంధన ధరలు స్థిరంగా ఉన్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- IND vs SA series: భారత్-దక్షిణాఫ్రికా టీ20 సిరీస్ వాయిదా
IND vs SA series: భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరగాల్సిన టీ20 సిరీస్ వాయిదా పడింది. ప్రస్తుత పర్యటనలో కేవలం వన్డే, టెస్టు సిరీస్ మాత్రమే జరుగుతుందని బీసీసీఐ వెల్లడించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- పూర్తిగా కోలుకున్న కమల్.. ఆస్పత్రి నుంచి డిశార్జ్
kamal haasan corona virus: కరోనా బారిన పడిన దిగ్గజ నటుడు కమల్‌హాసన్ ప్రస్తుతం పూర్తిగా కోలుకున్నారు. ఆస్పత్రి నుంచి డిశార్చ్ అయ్యారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటో వైరల్‌గా మారింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.