- కేంద్ర మంత్రి అమిత్ షా శ్రీశైలం పర్యటన.. భారీ బందోబస్తు
కేంద్ర మంత్రి కేంద్ర హోం మంత్రి అమిత్ షా శ్రీశైలం మల్లన్న దర్శనానికి రానున్నారు. ఆయన హెలికాఫ్టర్‌లో సున్నిపెంట చేరుకున్నారు. పోలీసులు రహదారులకు ఇరువైపులా బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ తనిఖీలు చేపడుతున్నారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- VIVEKA MURDER: కొనసాగుతున్న దర్యాప్తు..విచారణకు హాజరైన వివేకా పీఏ కృష్ణారెడ్డి
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో 67వ రోజు సీబీఐ విచారణ కొనసాగుతోంది. కడప, పులివెందులలో రెండు బృందాలు ముమ్మర దర్యాప్తు చేపట్టాయి.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'రాష్ట్రంలో బీసీలపై దాడులు నిత్యకృత్యమయ్యాయి'
ఏపీలో బీసీలపై దాడులు నిత్యకృత్యమయ్యాయని జాతీయ బీసీ కమిషన్ సభ్యుడు తల్లోజు ఆచారి అన్నారు. గుంటూరు ఆర్అండ్బీ బంగ్లాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలుగు రాష్ట్రాల్లో బీసీలపై జరిగే దాడులను విచారణ చేస్తున్నామని చెప్పారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఔరా..! అల్లుడు తెచ్చిన శ్రావణం సారె అదుర్స్
పది వేల కేజీల స్వీట్లు.. వంద అరటి గెలలు.. రెండు వ్యాన్లలో పళ్లు, పూలు.. వందలాది చీరలు, రవికలు. ఏంటి ఇదంతా అనుకుంటున్నారా..? శ్రావణ మాసం ప్రారంభంలో కొత్త అల్లుడు అత్తారింటికి వచ్చిన సందర్భంగా తీసుకొచ్చిన సారె. గోదారోళ్ల సారె గోదారంత అన్నట్లు.. కొత్త అల్లుడు తెచ్చిన సారె ఔరా అనిపించింది.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 152 మంది పోలీసులకు హోంమంత్రి ఎక్స్‌లెన్స్ మెడల్
కేంద్ర హోంమంత్రి మెడల్ ఫర్ ఎక్స్‌లెన్స్ ఇన్ ఇన్వెస్టిగేషన్ అవార్డుకు దేశవ్యాప్తంగా 152 మంది పోలీసులు ఎంపికయ్యారు. అత్యధికంగా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి 11 మంది ఎంపికైనట్లు కేంద్రం తెలిపింది. ఏపీ, తెలంగాణ నుంచి ఐదుగురు చొప్పున మెడల్ అందుకోనున్నట్లు వెల్లడించింది.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'పార్లమెంట్ సమావేశాలు జరగలేదనే ప్రజలు అనుకుంటున్నారు'
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు ప్రతిపక్ష నేతలు. పార్లమెంటు నుంచి విజయ్ చౌక్ వరకు ర్యాలీ చేపట్టారు. దేశంలో 60 శాతం మంది ప్రజలు పార్లమెంట్ సమావేశాలు జరగలేదనే అనుకున్నారని రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- వచ్చేనెలలో కొవాగ్జిన్ అనుమతిపై డబ్ల్యూహెచ్ఓ నిర్ణయం!
కొవాగ్జిన్ టీకా అత్యవసర అనుమతిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) వచ్చే నెలలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ మేరకు డబ్ల్యూహెచ్ఓలో వ్యాక్సిన్లపై సహాయ డైరెక్టర్ జనరల్‌గా ఉన్న మరియాంజెలా సిమావో తెలిపారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- దేశంలో పెరుగుతున్న విమానయాన ప్రయాణికులు
దేశంలో విమానయాన ప్రయాణికుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గతేడాది ప్రయాణికుల సంఖ్యతో పోల్చితే ఈ ఆర్థిక సంవత్సరం నాలుగు రెట్లుకుపైగా పెరిగినట్లు ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. జూన్ నెలలో 5.18లక్షలు మంది విదేశీ ప్రయాణం చేయగా.. 59.94లక్షల మంది స్వదేశీ ప్రయాణం చేశారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- పెళ్లి తర్వాత రోహిత్లో ఇంత మార్పా?
పెళ్లి తర్వాత రోహిత్ శర్మ చాలా మారిపోయాడని అంటున్నాడు దినేశ్ కార్తిక్(Dinesh Karthik commentary). 'సూర్యవంశం' సినిమా చూసి ఏడ్చేసే అంత సున్నిత స్వభావం ఉన్న రోహిత్(Rohit Sharma news).. ఇప్పుడు గేమ్ ఆఫ్ థ్రోన్స్ వంటి సిరీస్‌లు చూసేస్తున్నాడని చెబుతున్నాడు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- దేవరకొండ 'వర్క్ ఫ్రమ్ హోం'.. రిలీజ్ డేట్‌తో సుధీర్‌బాబు
కొత్త సినిమా అప్డేట్స్ వచ్చాయి. ఇందులో విజయ్ దేవరకొండ, సుధీర్ బాబు, నిఖిల్, శ్రీవిష్ణు, అడవి శేష్ సినిమా వివరాలు ఉన్నాయి. అవన్నీ మీకోసం..పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.