- కరోనా కల్లోలం- దేశంలో మరో లక్షా 45 వేల కేసులు
దేశంలో కరోనా 2.0 ఉగ్రరూపం దాల్చుతోంది. ఆందోళనకర స్థాయిలో కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. కొత్తగా 1,45,384 మందికి వైరస్ సోకినట్టు తేలింది. కొవిడ్ బారినపడిన వారిలో మరో 794 మంది ప్రాణాలు కోల్పోయారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- నిండుకుంటున్న టీకా నిల్వలు- పంపిణీకి బ్రేకులు!
దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతుండగా.. టీకాల కొరత వేధిస్తోంది. చాలా రాష్ట్రాలు తమ వద్ద టీకా నిల్వలు పూర్తయ్యాయని చెబుతున్నాయి. మరిన్ని టీకా డోసులను పంపేలా చర్యలు తీసుకోవాలని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- పోలవరం సమీపంలో బస్సు ప్రమాదం.. బస్సులో 70 మంది ప్రయాణికులు
విద్యార్థులతో సహా 70 మంది ప్రయాణికులతో వెళుతున్న ఆర్టీసీ బస్సు స్టీరింగ్ విరిగిపోయి ప్రమాదానికి గురైంది. డ్రైవర్ చాకచక్యంతో పెద్ద ప్రాణనష్టం తప్పింది. ఈ ఘటన.. పశ్చిమగోదావరి జిల్లా పోలవరం ప్రాజెక్టు సమీపంలో జరిగింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- తెదేపా అధినేత చంద్రబాబును కలిసిన రాయచోటి వైకాపా నేత!
వైకాపా నాయకుడు రామ్‌ప్రసాద్‌రెడ్డి.. తెదేపా అధినేత చంద్రబాబును కలిశారు. ఆయన త్వరలో తెదేపాలో చేరే అవకాశమున్నట్టు పార్టీ వర్గాల సమాచారం.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- రూ.3 కోట్ల బీమా కోసం.. కారులోనే భర్తను కడతేర్చి
తమిళనాడులో అమానవీయ ఘటన జరిగింది. రూ.3 కోట్ల బీమా డబ్బుల కోసం భర్తను కడతేర్చింది ఓ భార్య. చివరికి పోలీసులకు చిక్కింది.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- కూచ్‌బెహార్ జిల్లాలో కాల్పులు- వ్యక్తి మృతి
బంగాల్ నాలుగో విడత పోలింగ్‌లో కాల్పులు కలకలం సృష్టించాయి. కూచ్‌బెహార్ జిల్లా షిటల్కుచిలోని పతంతులి ప్రాంతంలో ఓ వ్యక్తిని కాల్చి చంపారు దుండగులు. మృతుడు ఓటు వేసేందుకు క్యూలైన్లో వేచి ఉన్న సమయంలో అతనిపై కాల్పులకు పాల్పడ్డారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'అఫ్గాన్‌లో ఘర్షణలకు బాధ్యతాయుతమైన ముగింపు'
అఫ్గాన్‌లో ఘర్షణలకు బాధ్యతాయుతమైన ముగింపు చెప్పేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కట్టుబడి ఉన్నారని శ్వేతసౌధం పేర్కొంది. త్వరలోనే ఆ దేశం నుంచి తమ బలగాల ఉపసంహరిస్తామని తెలిపింది. తైవాన్ విషయంలో చైనాతో ఓపికగా సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పింది.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- అలీబాబాకు మరోసారి షాక్ ఇచ్చిన చైనా
చైనా వ్యాపార దిగ్గజం, అలీబాబాపై అధికార కమ్యూనిస్టు పార్టీ మరోసారి ఆంక్షల కొరడా ఝుళిపించింది. గుత్తాధిపత్యాన్ని నిలువరించేందుకు 2.8 బిలియన్ డాలర్ల జరిమానా విధించింది.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఐపీఎల్: మొదటి మ్యాచ్‌పై ఎవరు ఏమన్నారంటే?
ఐపీఎల్ 14వ సీజన్లో భాగంగా ముంబయి ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ విజయం సాధించింది. ఈ నేపథ్యంలో మ్యాచ్ ముగిశాక మాట్లాడారు ఇరుజట్ల కెప్టెన్లు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'వకీల్‌సాబ్' చిత్రాన్ని వీక్షించిన మెగా ఫ్యామిలీ
పవన్ కల్యాణ్ నటించిన 'వకీల్‌సాబ్' చిత్రాన్ని మెగాస్టార్ చిరంజీవి కుటుంబసమేతంగా థియేటర్‌కు వెళ్లి వీక్షించారు. వీరితో పాటు హీరోలు వరుణ్ తేజ్, సాయితేజ్, నిఖిల్ విరివిగా సినిమాను చూసి.. పవన్ నటనపై ప్రశంసలు కురిపించారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.