- లైవ్ అప్డేట్స్: కార్పొరేషన్ల మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్ల ఎన్నిక ప్రక్రియ ప్రారంభం
నగర, పురపాలికల్లో నూతన పాలకవర్గాలు కొలువుదీరనున్నాయి. పాలవర్గాల ప్రమాణ స్వీకారానికి అధికారులు సర్వం సిద్ధం చేశారు. సమగ్ర కసరత్తు తర్వాత పలుచోట్ల మేయర్లు, ఛైర్‌పర్సన్ల పేర్లను మంత్రులు ప్రకటించారు. మరికొన్ని చోట్ల వివిధ వర్గాల మధ్య పోటీతో సందిగ్ధత కొనసాగుతోంది.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- తాడిపత్రి చేరుకున్న తెదేపా కౌన్సిలర్లు
తాడిపత్రి పురపాలక సంఘం ఛైర్మన్ ఎన్నికపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. రహస్య శిబిరం నుంచి తెదేపా కౌన్సిలర్లు తాడిపత్రికి చేరుకున్నారు. ఇప్పటికే పోలీసులు పట్టణంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- బెజవాడ మేయర్ పీఠంపై శ్రీకాకుళం 'భాగ్య'0..!
సిక్కోలు ఆడపడుచు విజయవాడ మహానగరానికి ప్రథమ పౌరురాలు కాబోతున్నారు. రాయన భాగ్యలక్ష్మీని అనూహ్యంగా మేయర్ పదవి వరించింది. ఈమె భర్త నరేంద్రకుమార్‌ది విజయవాడ.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు.. ఆధిక్యంలో తెరాస
తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఎన్నికలు జరిగిన రెండు చోట్ల... తెరాస అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- గోద్రాలో భాజపాను గద్దె దించిన మజ్లిస్ పార్టీ
గోద్రా మున్సిపాలిటీలో భాజపాను అధికారానికి దూరం చేసింది ఒవైసీ నేతృత్వంలోని ఎంఐఎం పార్టీ. ఇక్కడ గెలుపొందిన ఏడుగురు సభ్యులతో స్వతంత్రులకు మద్దతిచ్చి, వారు అధికార పగ్గాలు చేపట్టేలా చేసింది. దీంతో.. 2002 తర్వాత తొలిసారి ఈ మున్సిపాలిటీని భాజపా కోల్పోయినట్లైంది.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- అత్యాచారం కేసులో 9మందికి జీవితఖైదు
అత్యాచారానికి పాల్పడిన 9 మందికి జీవితఖైదు విధించింది బిహార్‌లోని గయా జిల్లా కోర్టు. నిందుతులపై రూ. 15,000 జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- దేశంలో భారీగా పెరిగిన కేసులు- కొత్తగా 35,871 మందికి వైరస్
దేశంలో కొవిడ్ వ్యాప్తి అంతకంతకూ పెరుగుతోంది. ఒక్కరోజే దాదాపు 35వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 17,741 మంది వైరస్‌నుంచి కోలుకున్నారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- హెలికాప్టర్ కూలి 9 మంది మృతి
అఫ్గానిస్థాన్ మైదాన్ వర్దాగ్ రాష్ట్రం బేహ్సుద్ జిల్లాలో స్పెషల్ ఫోర్సెస్ హెలికాప్టర్ కూలింది. ఈ ఘటనలో 9 మంది మృతిచెందారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- కివీస్, సఫారీలతో టీ20 సిరీస్‌కు బీసీసీఐ ప్రయత్నాలు!
ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‌నకు ముందు భారత జట్టుకు మరింత ప్రాక్టీస్ అవసరమని భావిస్తోందీ బీసీసీఐ. అందుకోసం ఈ మెగాటోర్నీకి ముందు న్యూజిలాండ్, దక్షిణాఫ్రికాలతో టీ20 సిరీస్ ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- 'శాకుంతలం'లో దుర్వాస మహర్షిగా మోహన్‌బాబు!
దర్శకుడు గుణశేఖర్ ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తోన్న చిత్రం 'శాకుంతలం'. మహాభారతం ఆదిపర్వంలోని శకుంతల, దుష్యంతుని ప్రేమకథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. అయితే ఇందులోని దుర్వాస మహర్షి పాత్రలో ప్రముఖ నటుడు మోహన్‌బాబు నటించనున్నట్లు టాలీవుడ్లో ప్రచారం జరుగుతోంది.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి