- 'ప్రభుత్వమే అంత్యక్రియలు చేస్తుంది'
కొవిడ్ మృతుల నుంచి వైరస్ వ్యాపించకుండా చర్యలు తీసుకుంటామని సీఎం జగన్ అన్నారు. చనిపోయినవారిలో కొన్ని గంటల తర్వాత వైరస్ ఉండదని పేర్కొన్నారు. వైరస్ కారణంగా మానవత్వం మరుగునపడే పరిస్థితులు చూస్తున్నామన్నారు. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
- 'కుమార్తెను విచారించిన సీబీఐ'
వివేకా హత్య కేసులో సీబీఐ వేగం పెంచింది. ఇవాళ ఆయన కుమార్తె సునీతను మూడు గంటల పాటు విచారించింది. అంతకుముందు సస్పెన్షన్ కు గురైన సీఐ శంకరయ్యను అధికారులు విచారించారు. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
- 'నా భర్త ఆచూకీ తెలపండి'
గుంటూరు సర్వజనాస్పత్రి నుంచి కరోనా బాధితుడొకరు అదృశ్యమయ్యారు. ఈ నెల 14న తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిలో ఆ వ్యక్తి చేరగా... మెరుగైన వైద్యం కోసం 16వ తేదీ రాత్రి జీజీహెచ్‌కు తరలించారు. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
- పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు
భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుకు పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారంలో భాజపాతో కలిసి నడుస్తామని తెలిపారు.మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
- మరో ప్రతిపాదన
రాజస్థాన్‌లో రాజకీయ సంక్షోభం రోజురోజుకు కొత్త మలుపు తిరుగుతన్న వేళ అసెంబ్లీ సమావేశాలకు పట్టుపడుతోంది అశోక్ గహ్లోత్ ప్రభుత్వం. జులై 31 నుంచే సమావేశాలు నిర్వహించాలని కోరుతూ గవర్నర్‌కు మరోసారి సవరణలతో కూడిన ప్రతిపాదనలు పంపింది. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
- 179 కళాశాలలు మూత
దేశంలో గత తొమ్మిదేళ్లలో ఎన్నడూలేని విధంగా తొలిసారి సుమారు 180 వృత్తి విద్యాసంస్థలు మూతపడ్డాయని అఖిల భారత సాంకేతిక విద్యా మండలి(ఏఐసీటీఈ) తెలిపింది. ఆయా కళాశాలల్లో ఖాళీలు ఏర్పడటం సహా.. ఇతర సాంకేతిక లోపాలే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
- డాలర్లు చెల్లించిన ఫోక్స్‌వేగన్
డీజిల్ గేట్ కుంభకోణంలో ప్రముఖ కార్ల సంస్థ ఫోక్స్‌వేగన్.. వినియోగదారులకు 9.5 బిలియన్ డాలర్లను పరిహారంగా అందజేసినట్లు యూఎస్ ఫెడరల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ వెల్లడించింది. 2015లో సంస్థ తయారు చేసిన ఇంజిన్ల నుంచి ఉద్గారాలు తక్కువగా వస్తున్నాయని నమ్మబలికిన కారణంగానే ఈ పరిహారాన్ని చెల్లించాల్సి వచ్చింది. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
- కరోనా మళ్లీ వస్తుందా?
ఒక్కసారి కరోనా బారిన పడ్డవారికి మళ్లీ వైరస్ సోకే ప్రమాదముందా? ఒకవేళ వచ్చినా.. వైరస్‌పై మరోసారి పోరాడగల రోగ నిరోధక శక్తి వాళ్లకు ఉంటుందా? అంటే దాదాపు ఔననే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. కోలుకున్న వారికి కరోనా మళ్లీ సోకే అవకాశాలు తక్కువే అని చెబుతున్నారు. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
- తనదైన ముద్ర వేస్తాడు..
టెస్టుల్లో రోహిత్ శర్మ అద్భుతంగా ఆడతాడని చెప్పిన మాజీ క్రికెటర్ ఇర్పాన్ పఠాన్.. ఈ ఫార్మాట్లో సెహ్వాగ్‌లా తనదైన ముద్రవేస్తాడని అభిప్రాయపడ్డాడు. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
- 'ఇకపై చూస్తారు'
బాలీవుడ్ నటుడు విద్యుత్ జమ్వాల్.. తాను నటించిన 'యారా' 'ఖుదా హాఫిజ్' చిత్రాలు ఓటీటీలో విడుదల కావడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపాడు. ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా సినిమాలు విడుదలైతే ప్రజలు సొంత నిర్ణయంతో చిత్రాలను చూస్తారని అభిప్రాయపడ్డాడు. దీంతోపాటు జీవితంలో ఏ విషయం పట్ల అసంతృప్తి చెందనని స్పష్టం చేశాడు. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి