- ముహుర్తం ఖరారు.. వాళ్లకే ఛాన్స్
రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ముహుర్తం ఖరారైంది. ఈ నెల 22న మధ్యాహ్నం ఒంటిగంట తర్వాత మంత్రి వర్గ విస్తరణ జరగనుంది. అదేరోజు నూతన మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాజీనామా చేసిన మంత్రుల సామాజిక వర్గానికే తిరిగి మంత్రి వర్గంలో అవకాశం దక్కనుంది. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
- అత్యాచార ఘటనపై చంద్రబాబు ఆగ్రహం
దిశ చట్టం చేశామని కోట్ల రూపాయలతో ప్రచారం చేసుకున్న వైకాపా ప్రభుత్వం... ఆ చట్టం అమలులో పూర్తిగా విఫలమైందని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు. రాజమహేంద్రవరంలో ఓ దళిత బాలికను అత్యంత పాశవికంగా అత్యాచారం చేసి, పోలీసు స్టేషన్ ముందే వదిలిన ఘటనపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకాపా పాలనలో మహిళలకు భద్రతలేదని విమర్శించారు. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
- వైకాపాలో మోసపోయానంటూ మహిళ ఆత్మహత్యాయత్నం
తనను వైకాపా నాయకులు మోసం చేశారని మాల మహానాడు మహిళా అధ్యక్షురాలు బొల్లిపల్లి జోని కుమారి ఆరోపించారు. విజయవాడ ప్రెస్ క్లబ్లో మీడియా ఎదుటే ఆత్మహత్యాయత్నం చేశారు. పార్టీలో ఉన్న తనను కొంతమంది నేతలు అన్యాయం చేశారని వాపోయారు. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
- కరోనా సోకిందంటూ ట్వీట్.. వ్యక్తిపై కేసు నమోదు
తిరుమల శ్రీవారి ఆలయ ఓఎస్డీ డాలర్ శేషాద్రికి కరోనా సోకిందంటూ ట్వీట్లు చేసిన వ్యక్తిపై కేసు నమోదైంది. తన ఆరోగ్యంపై బద్రి అనే వ్యక్తి తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ... తితిదే ఉన్నతాధికారులకు డాలర్ శేషాద్రి ఫిర్యాదు చేశారు. డాలర్ శేషాద్రి ఫిర్యాదును పరిశీలించిన తితిదే ఉన్నతాధికారులు.. విషయాన్ని ఒకటో పట్టణ పోలీసులకు వివరించారు. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
- 'ఆయన ఓ పనికిరాని వ్యక్తి'
రాజస్థాన్ కాంగ్రెస్ తిరుగుబాటు నేత సచిన్ పైలట్‌పై.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. పైలట్‌ను ఓ పనికిరాని వ్యక్తిగా అభివర్ణించారు. భాజపా మద్దతుతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
- రాహుల్, నడ్డా మాటల యుద్ధం
ప్రధాని మోదీని నాశనం చేసేందుకు ఓ రాజవంశం (రాహుల్ గాంధీ కుటుంబం) చాలాకాలంగా ప్రయత్నిస్తోందని భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా విమర్శించారు. ప్రధాని మోదీ బలమైన వ్యక్తి అనడం పూర్తిగా కల్పితమని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వీడియో విడుదల చేసిన నేపథ్యంలో నడ్డా... ఈ ప్రతివిమర్శలకు పూనుకున్నారు. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
- నిప్టీ @ 11,022
స్టాక్ మార్కెట్లలో సోమవారం రికవరీ ర్యాలీ కొనసాగింది. సెన్సెక్స్ 399 పాయింట్లు బలపడింది. నిఫ్టీ 120 పాయింట్లు పుంజుకుని నాలుగు నెలల తర్వాత తిరిగి 11 వేల మార్క్‌ను దాటింది. బ్యాంకింగ్, ఐటీ షేర్లు లాభాలకు దన్నుగా నిలిచాయి. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
- నీటి కోసం డ్యామ్ బ్లాస్ట్
చైనాలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. దేశవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఆనకట్టలు వరద నీటి ప్రవాహాన్ని తట్టుకోలేకపోతున్నాయి. ఈ నేపథ్యంలో సెంట్రల్ చైనాలోని ఓ ఆనకట్టను పేల్చివేసి... వరద నీటిని విడుదల చేశారు అధికారులు. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
- 'ధోనీ రీఎంట్రీకి, ఐపీఎల్‌కు సంబంధమేమీ లేదు'
టీమ్ఇండియా మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్ రీఎంట్రీకి.. ఐపీఎల్లో అతడి ప్రదర్శనకు సంబంధమేమీ లేదని అభిప్రాయపడ్డాడు మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా. దీంతో పాటు దక్షిణాఫ్రికా స్టార్ బ్యాట్స్‌మన్ ఏబీ డివిలియర్స్ కూడా త్వరలోనే పునరాగమనం చేస్తాడని అన్నాడు. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
- ఛాలెంజ్ స్వీకరించిన రాశీ ఖన్నా
హీరోయిన్ రష్మిక మంధాన విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరించింది నటి రాశీ ఖన్నా. మొక్కలు నాటి మరో ముగ్గురిని నామినేట్ చేసింది. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి